వివాదాస్ప‌ద‌, షాక్ ఇచ్చే నిర్ణ‌యాల‌కు సుప‌రిచిత చిరునామా అయిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌ర్కారు మ‌ళ్లీ ఇంకో షాకింగ్ న్యూస్ తెర‌మీద‌కు తెచ్చింది. అమెరికాలో చట్ట బద్ధంగా పనిచేయడానికి వీలుగా హెచ్‌1 బీ వీసా ఉన్నవారి జీవిత భాగస్వాములకు హెచ్‌4 వీసాను జారీ చేస్తున్నారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చట్టం తెచ్చారు. ఇలా వీసా పొందిన వారిలో చాలా మంది భారత్‌కు చెందిన నిపుణులే.  ప్రస్తుతం అమెరికాలో 70 వేల మంది భారతీయులకి హెచ్‌4 వీసా ఉన్నట్లు అంచ‌నా. ఇలాంటి కీల‌క‌మైన అంశంలో వ‌య‌సు స‌మ‌స్య కార‌ణంగా ఊహించ‌ని ఇబ్బంది త‌లెత్తుతోంది.

 

అయితే, అమెరికా చ‌ట్టాల ప్ర‌కారం, 21 సంవ‌త్స‌రాల వ‌య‌సు తర్వాత కూడా చదువుకుంటున్న పిల్లలు ఎఫ్ 1 వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. హెచ్1 బీ వీసాలపై పని చేస్తున్న చాలా మంది భారతీయుల పిల్లలకు 21 ఏళ్లు దాటాయి. ఇప్పుడు వారి చదువు వివిధ దశల్లో ఉంది. ఇప్పుడు వారంతా హెచ్ 4 వీసా కిందకురారు. వీళ్లంతా ఎఫ్ 1 వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎఫ్ 1 వీసా కోటాలో భాగంగా భారతీయులకు అక్కడి ప్రభుత్వం తక్కువ వీసాలను జారీ చేస్తుంది. దీంతో ఎంతో మంది భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేప‌థ్యంలో పలువురు కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌నున్నారు.

 

కాగా, హెచ్-1బీ వీసా కలిగి ఉండి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములకు హెచ్‌4 వీసాలు మంజూరు చేస్తారు. ఈ హెచ్‌4 వీసాల‌ ద్వారా వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు క‌ల్పించారు. ఈ విధానం భారతీయులకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతులను రద్దుచేశారు. అమెరిక‌న్ల అవ‌కాశాల‌ను హెచ్4 వీసా గండికొడుతోంద‌ని ఆరోపించారు. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు.  దీంతో హెచ్-4 వీసాదారు లు అమెరికాలో పనిచేసుకొనేందుకు కొలంబియా సర్క్యూట్ కోర్టు అనుమతినిచ్చింది. తాజాగా మ‌రోమారు ఈ నిబంధ‌న రూపంలో షాక్ త‌గింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: