బలహీనత మనిషికి ఉన్న రోగం. మోసం చేయాలనుకునే వారికి ఇదే బలం. ఒక మనిషిని ఈజీగా తమ ఉచ్చులో పడ వేయాలనుకుంటే ముందుగా అతని బలహీనత మీద దెబ్బకొట్టడం ఈ మద్యకాలంలో జరుగుతున్న నేరాలలో ఉపయోగిస్తున్న ఫార్ములా.. ఇకపోతే మగవాడు అని చెప్పుకునే అతనికి ఉన్న ముఖ్యమైన బలహీనత కోరిక. ఆ కోరిక తీర్చడానికి ఒక ఆడది కావాలి. ఒకవేళ అలాంటి ఆడవారు దొరికారనుకో కనీసం వెనకా ముందు ఆలోచించకుండా బుద్ది అనే తోక ఊపుకుంటు ఆమె వొళ్లో వాలిపోతాడు.

 

 

ఇప్పుడు మోసం చేయాలనుకుంటున్న వారికి ఇదొక ఆయుధంగా మారింది. ఇలా మహిళలను ఎరవేసి నిలువు దోపిడి చేస్తున్నారు. ఇలాంటి మూఠానే ఫ్రాన్స్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ వివరాలు తెలుసుకుంటే ఒక విజిటింగ్ కార్డు మీద డమ్మి చిరునామాను, టెంపరరీ ఫోన్ నంబర్‌ను ముద్రించి, తమ దగ్గర అందమైన అమ్మాయిలు ఉన్నారని, వారితో మసాజ్ చేయిస్తామని, పారిస్‌లోని వివిధ ప్రదేశాలలోని అబ్బాయిలకు ఈ మహిళా గ్యాంగ్ పంచుతూ వస్తోంది. ఇలా వీరి ఎరలో పడిన ఓ వ్యక్తి రూ. 11 లక్షలను పొగొట్టుకున్నాడు.

 

 

టర్కీకి చెందిన ఓ వ్యక్తి పారిస్‌లోనే ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఓ పబ్ లో పరిచయమైన అమ్మాయి ద్వారా ఈ వివరాలు తెలుసుకుని, ఆ మహిళను సంప్రదించాడట. ఇంకే ముంది మసాజ్ చేయడానికి తమ వద్ద నుండి ఎనిమిది మంది మహిళలు మీ ఫ్లాట్‌కు వస్తామని చెప్పిందట. ఇక ఆ వచ్చిన వారితో ఎంచక్కా మసాజ్ చేయించుకోవచ్చని అనుకున్న ఆ యువకుడికి అనుకోని షాక్ తగిలింది.

 

 

అదేమంటే అన్నట్తుగానే ఆ మహిళలు ఇతని ఫ్లాట్‌కు వచ్చి కాలింగ్ బెల్ కొట్టగా, ఆనందపడుతూ డోర్ తీసిన అతనికి ఎనిమిది మంది ఆఫ్రికన్ మహిళలు ఒకేసారి అతని ఫ్లాట్లోకి దూసుకొచ్చి, వెంటవెంటనే, అతన్ని ఓ గదిలో నిర్భందించి అతడి దగ్గర ఉన్న సుమారు రూ.11 లక్షల నగదు..అలాగే ఫోన్, ఇతర విలువైన వస్తువులు కాజేయడమే కాకుండా, విషయం పోలీసులకు చెప్తే చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారట.

 

 

కానీ వాళ్లు దోచుకున్న సొమ్ము గుర్తొచ్చిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని ట్రాప్ చేసి అరెస్టు చేసి, ఆమెనుండి నిజం రాబట్టి ఇదే తరహాలో మరో బక్రను దోచుకునే సమయంలో,పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారట.. చూశారా మగపురుగులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా ఇలాంటి వారి చేతిలో మోసపోతున్న వారు ఎక్కువగానే ఉన్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: