ఈ మధ్య కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోలీసులకు పట్టుబడితే మాత్రం వేల రూపాయలు వాహనదారులు ఫైన్ల రూపంలో చెల్లిస్తున్నారు. మరియు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిలో ఎక్కువశాతం లైసెన్స్ లేని వారి వలనే ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని సార్లు వాహనదారులు ఫైన్లు తప్పించుకోవటానికి ప్రయత్నించే క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. 
 
రవాణాశాఖ అధికారులు ప్రమాదాలను నివారించడం కొరకు, త్వరగా వాహనదారులకు లైసెన్స్ జారీ చేసే విధంగా నిబంధనలలో మార్పులు చేస్తున్నట్టు, కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. రవాణాశాఖ అధికారులు గతంలో వాహనదారులకు లెర్నింగ్ లైసెన్స్ ను ఇచ్చేవారు. ఆ తరువాత రెన్యూవల్ లైసెన్స్ ను ఇచ్చేవారు. లెర్నింగ్ లైసెన్స్, రెన్యూవల్ లైసెన్స్ కొరకు రెండు వేరు వేరు అప్లికేషన్ ఫామ్స్ ను ఇచ్చేవారు. 
 
ఇకనుండి ఒకే లైసెన్స్ ఫామ్ ను రెండు అప్లికేషన్లకు కలిపి ఇచ్చే విధంగా రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ఇకనుండి ధరఖాస్తు చేసిన 20 రోజుల్లోనే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే విధంగా రవాణాశాఖ చర్యలు చేపట్టింది. దీనిపై సాధ్యాసాధ్యాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తోందని తెలుస్తోంది. రవాణాశాఖ రెన్యూవల్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 
 
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూల్స్ ను కఠినతరం చేయటంతో పాటు యాక్సిడెంట్లను తగ్గించటం కొరకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలను అమలులోకి తెచ్చింది. మరోవైపు లైసెన్స్ పొందటానికి కూడా విద్యార్హతను 8వ తరగతికి తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రవాణాశాఖలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు ఇటు రవాణాశాఖకు, అటు వాహనదారులకు మేలు చేసే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే లైసెన్స్ ల విషయంలో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: