సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల జరుగుతున్న నేరాలను అదుపుచేయడానికి ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నాయో అందరికి తెలిసిన విషయమే. అయినా కాని వారి శ్రమ పూర్తిగా ఫలించడం లేదు. ఇకపోతే మార్పు అనేది ఒకరు చెబితే వచ్చేది కాదు. సమాజం బాగుపడాలంటే ఎవరికి వారు మారాలి. వారి ఆలోచనల్లో మార్పు రావాలి. మారవలసింది ఎదుటివారు అనే ఆలోచనను మైండ్ నుండి పూర్తిగా తొలగించాలి. అప్పుడు మాత్రమే ఫలితాలు రావడం మొదలు అవుతుంది.

 

 

ఇకపోతే ఇప్పుడు సమాజాన్ని, శ్మశానంగా మారుస్తున్న భూతం పోర్నోగ్రఫీ.. దీన్ని చూస్తున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతుండటంతో ఇప్పుడు దేశానికి ఇది ఒక తీవ్రవాదంగా తయారైయింది.. ఈ పోర్నోగ్రఫీ మనిషి మనసును మాయ చేసి, అతని ఆలోచన శక్తిని కప్పివేస్తుంది. ఫలితంగా ఇలాంటి వారు. తమకు తెలియకుండానే సమాజానికి హానిచేయడం మొదలు పెడుతారు. ఇక ఈ మద్యకాలంలో సినిమాలు, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా సైట్లలో... ఎక్స్‌పోజింగ్ హద్దులు మీరుతోంది.

 

 

స్కిన్ షోకి ఏమాత్రం వెనకాడని చాలా మంది హీరోయిన్లు... తమ అశ్లీల దృశ్యాలు, ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తూ... కుర్రాళ్లు చెడిపోతున్నారని ఎవరైనా ఆరోపణలు చేస్తే... తమ స్వేచ్ఛకు సంకెళ్లు వెయ్యాలని చూస్తున్నారని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇక స్వేచ్చ పేరుతో బట్టలు విప్పుకుని చూపించమని ఏ రాజ్యాంగంలో రాసిలేదన్న విషయం గుర్తుపెట్తుకుంటే చాలు. నీ స్వేచ్చ సమాజానికి హానికరమైనప్పుడు దాన్ని ప్రశ్నించవలసిన భాద్యత, నిరోధించవలసిన అధికారం చట్టానికి ఉంది..

 

 

ఇకపోతే దిశ హత్యాచార ఘటన జరిగిన తర్వాత... పోర్నోగ్రఫీకి చెక్ పెట్టేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా...సైబర్ క్రైమ్ పోలీసులు... ఎవరైనా ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీల్లో, వీడియోలు, బూతు సినిమాలు చూస్తూ ఉంటే, అలాంటి వాళ్లను కనిపెట్టి, వాళ్లకు వార్నింగ్ మెసేజ్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ పోర్నోగ్రఫీపై ప్రత్యేక నిఘా పెడుతున్నారట.

 

 

అంతే కాకుండా ఈ పోర్న్ వీడియోలు, ఫొటోలు, ఎవరెవరు చూస్తున్నారో, వారి వివరాలన్నీ ఇంటర్నెట్ ఐపీ అడ్రెస్ ద్వారా, సేకరిస్తున్నారని తెలిసింది. ఇకపోతే ఇలాంటి వారికిచ్చిన పోలీసుల హెచ్చరికల్ని లైట్ తీసుకుంటే... అరెస్టు చేసి... ఏడేళ్ల జైలు శిక్ష వేస్తారని తాజా సమాచారం. ఇక దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే అదేపనిగా బూతు బొమ్మలు చూసేవాళ్లకు త్వరలో మూడినట్లే అని అనుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: