సోషల్ మీడియా ద్వారా చిక్కుల్లో పడిన యువకులు ఎంతో మంది ఉంటారు అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ చివరికి కటకటాలపాలైన వాళ్ళు చాలా మందే  ఉంటారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం లాంటివి చేయకూడదని పోలీసులు ఎన్ని సార్లు అవగాహన కల్పించినప్పటికీ... నెటిజన్లు అలాగే చేస్తూ కటకటాల పాలు అవుతారు. ఇక రాజకీయ నాయకుల మీద అసభ్య పోస్టులు పెట్టే నెటిజన్లు ఎంతోమంది ఉంటారు. తమకి నచ్చని నాయకునిగా అసభ్యకర పోస్టులు పెడుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక్కడ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ పెట్టినందుకు ఆ వ్యక్తిపై కేసు నమోదైంది. 

 

 

 ఇంతకీ ఆ వ్యక్తి ఎవరిని  దూషించాడు అంటారా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించాడు అంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన నెల్లూరుజిల్లా వింజమూరు లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించారు అంటూ రావిపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దంతులూరి రఘు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దంతులూరి రఘు. 

 

 

 అయితే దీనిపై విచారణ జరిపిన పోలీసులు అదే మండలంలోని బిల్లుపాటి  రవిపై కేసు నమోదు చేశారు. ఈనెల 8వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు రవి. ఇందులో అసభ్య పదజాలంతో దూషిస్తు వీడియో రికార్డ్ చేశారు సదరు వ్యక్తి . ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యే రోజా లను అసభ్యంగా పదజాలం వాడుతూ దూషించాడని...వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అని  పోలీసులు విచారణలో నిర్ధారించారు. దీంతో రవిపై కేసు నమోదు చేశామని... దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు పోలీసులు. కాగా  సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించి చివరికి కటకటాలపాలయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: