మనుషులు తెలి మీరుతున్నారని అనుకుంటున్నారు. ఆ తెలివిని చూసి వారికి వారే అబ్బురపడుతున్నారు. కాని వారి తెలివికి ఒక కాకి సవాల్‌గా విసిరింది. మనిషిలో ఉండే బద్దకాన్ని, నిర్లక్ష్యాన్ని హేళన చేస్తూ అందరు ముక్కున వేలు వేసుకునేలా తానొక పని చేసింది.. ఇకపోతే పారిశుద్దం అనేది పాటించడం, పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవడం మనిషి కర్తవ్యం. కాని ఆ బాధ్యతను విస్మరించి ఎక్కడపడితే అక్కడ చెత్తను పడవేయడం, ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వాడి పర్యావరణాన్ని నాశనం చేయడం. భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చడం వంటి పనులను అభివృద్ధి పేరిట నేటి మానవుడు చేస్తున్నాడు.

 

 

జంతువుల వల్ల, పక్షుల వల్ల పర్యావరణానికి కలిగే హాని కంటే మానవుల వల్ల జరిగే వినాశనం చాలా ఎక్కువ అని చెప్పక తప్పదు.. ఎందుకంటే తాను చేసే పనుల వల్ల  పచ్చని ప్రకృతి సమూలంగా నాశనం అవుతుందని తెలిసినా, తాను ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం నిజంగా సిగ్గు చేటని చెప్పవచ్చు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి తనవంతుగా పర్యావరణాన్ని తెలియకుండానే రక్షిస్తుంది. కానీ అన్ని తెలిసిన ఈ యుగపు మనిషి అని గొప్పగా చెప్పబడే మానవుడి వల్ల ఈ ప్రకృతికి ఎలాంటి ఉపయోగం లేదు.

 

 

ఎందుకంటే తాను బ్రతకడం కోసం మాత్రమే నిత్యం పోరాటం చేస్తున్నాడు గాని, తనను బ్రతికించే ఈ ప్రకృతి కోసం ఒక్క క్షణం కూడా కెటాయించడం లేదు.. ఇకపోతే కాకి తెలివితేటలు ఎలాంటివో మనం కొన్ని పాఠాల్లో చదివే ఉంటాం. అయితే, ఈ సారి మనుషులు తప్పకుండా నేర్చుకోవల్సిన ఓ పాఠాన్ని ఈ కాకి చెబుతోంది. అదే.. పరిశుభ్రత. రోడ్లపై ఇష్టానుసారంగా చెత్తను వేసే వ్యక్తులు తప్పకుండా ఈ కాకిని చూసైన బుద్ధి తెచ్చుకోవాలి.

 

 

ఎక్కడో పడివున్న ఓ సీసాను నోటితో పట్టుకొచ్చిన ఈ కాకి.. కిందపడేయకుండా డస్టు బిన్‌లో పడేసి, తాను నలుపైన తన మనసూ మాత్రం తెలుపని నిరూపించింది. కాని జంటిల్ మెన్ అని చెప్పుకునే మనిషి చూపుకు తెల్లగా ఉన్నా అతని ఆలోచనలు ఈ కాకిముందు దిగదుడుపే అని అనుకుంటున్నారట ఇప్పుడు ఈ వీడియోను చూసినవారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: