ఎక్కడైతే మన శక్తిని నిర్మాణాత్మకంగా వాడతామో అక్కడ సంపద సృష్టి జరిగి మనకు ధనం వచ్చే ఆస్కారం ఏర్పడి మనకు సిరిసంపదలకు దారి ఏర్పడుతుంది. అయితే సంపదను కోరుకునే వ్యక్తులు ముందుగా చేయవలసింది తాము ఏ రంగంలో రాణించగలమో తమకుతాము తెలుసుకోగలగడం. 

ప్రతి వ్యక్తి అన్ని రంగాలలోను రాణించడు అందువల్ల తనకు అభిరుచే ఉండే రంగాన్ని ఎంచుకున్న వ్యక్తికి ఆ రంగంలో విజయం లభించడమే కాకుండా ఆ రంగంలో ఆదాయం వచ్చి ఆర్ధిక భద్రత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈరోజు చాలామంది మధ్య తరగతి మహిళలు పురుషులతో సమానంగా తమ హాబీలను వృత్తిగా మార్చుకుని బాగా సంపాదిస్తూ సక్సస్ అవుతున్నారు.   

 

ఒకప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండే స్త్రీలు ఈరోజు తమ హాబీలను వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చి వారి హాబీలతోనే సంపద మార్గాలను అన్వేషింప గలుగుతున్నారు. కొత్తకొత్త వ్యాపారాల్లో తమ ప్రతిభను కళాత్మకతను ప్రదర్శిస్తూ ఎక్కువ అలసిపోకుండా ఇష్టమైన పనులతో డబ్బు బాగా గడిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లవర్‌వాజులు బొకేలు అమర్చటం ఒక కళ అలాగే నేడు ఫ్రూట్‌ బొకేలు మార్కెట్లోకి వచ్చేశాయి. తాజా పళ్లను అందంగా ఆకర్షణీయంగా బుట్టల్లో అమర్చి బర్త్‌డే గిఫ్ట్‌గా కార్పోరేట్‌హౌస్‌లకు ఆస్పత్రులకు పంపిణీ చేస్తున్నారు. తాజాపళ్లు డ్రైఫ్రూట్స్‌ చాక్లెట్స్‌తో వెదురు ప్లాస్టిక్‌ బుట్టల్ని అలంకరించి రకరకాల ఆకారాల్లో బొకేలాగా కూడా చేస్తున్నారు.
అదేవిధంగా తమకు సంగీతం నృత్యం లలో ప్రావీణ్యత ఉంటే చాలు ఆ ప్రావీణ్యతనే పెట్టుబడిగా మార్చి పట్టుదలతో చాలామంది స్త్రీలు తమ హాబీల ద్వారానే అనేక రకాలుగా సంపాదిస్తున్నారు. 


టి.వి ఛానల్స్ పెరిగి పోవడంతో రకరకాల హాబీల పట్ల స్త్రీలలో అవగాహన పెరిగిపోతోంది. మ్యూజికల్ టీచర్‌ గా మాత్రమే కాకుండా మ్యూజిక్‌ థెరపిస్టులు స్త్రీలు అనేకచోట్ల పనిచేస్తున్నారు. క్లినికల్‌ మ్యూజిక్‌ థెరపీ కోర్సు సైకాలజీ కోర్సులతో పాటు రకరకాల చిన్నచిన్న పనులతో కూడ బాగా సంపాదించ గలుగుతున్నారు. నర్సరీ రైమ్స్‌  పిల్లల కిష్టమైన వాయిద్యాలు నేర్పుతూ పెద్దపెద్ద పట్టణాలలో మాత్రమే కాకుండా చిన్నచిన్న నగరాలలో కూడ స్త్రీలు తమ హాబీలను వ్యాపారంగా మార్చుకుని వారు ఎదుగుతూ తమ కుటుంబానికి సహాయపడుతూ ఇష్టమైన పనిలోనే డబ్బు సంపాదన ఉంటుంది అన్న విషయాన్ని రుజువు చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: