సంక్రాంతి దసరా పండుగలు వచ్చాయంటే... ఆర్టీసీకి లాభాల పంట పండినట్లే. ఆయా పండుగలకు స్పెషల్ బస్సులను కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తుంది ఆర్టీసీ. అటు ఏపీఎస్ఆర్టీసీ తో పాటు ఇటు టిఎస్ఆర్టిసి కూడా పండుగ దినాలు ఎక్కువగా లాభాలు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ ఈ సంక్రాంతి సీజన్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వేసిన ఓ ప్లాన్ తో  తెలంగాణ బస్సులు వెలవెలబోతున్నాయి . ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు కిటకిట లాడుతున్నాయి. కానీ తెలంగాణ బస్సులు మాత్రం ఖాళీగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో భాగ్యనగరం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ... వీరిలో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు టికెట్ ధర మధ్య భారీగా తేడా కనిపిస్తుంది. 

 

 

 హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నడుపుతుంది... విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే బస్సు టిక్కెట్ ధరలను 40 శాతం తగ్గించింది ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ. హైదరాబాద్ కు వెళ్లి ప్రయాణికులను తీసుకుని వచ్చే బస్సులకు  కనీసం డీజిల్ ఖర్చు అయిన రావాలి అన్నది ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా అధికారుల ఆలోచన.ఈ  ఆలోచన మేరకే ప్రణాళికలను అమలు చేశారు. ఇక ప్రస్తుతం ఇది సత్ఫలితాలను ఇస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు  వచ్చే వారితో ఈ బస్సుల నిండిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం టికెట్ చార్జీలను తగ్గించడం లేదు. దీంతో ఆఫ్ రిటన్ ఛార్జిలతో  విజయవాడ వెళ్లిన టిఎస్ ఆర్టిసి బస్సు లన్ని  పూర్తిగా ఖాళీగానే వెనక్కి వచ్చేస్తున్నాయి. 

 

 

ఎందుకంటే ఏపీఎస్ ఆర్టీసీ చార్జీలు తగ్గించడంతో ప్రయాణికులు మొత్తం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వేసిన ప్లాన్ తో ఓ వైపు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటే .. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు మాత్రం ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో మరోసారి టిఎస్ఆర్టిసి కి తీవ్ర స్థాయిలో నష్టాలు ఏర్పడుతున్నది . అయితే ఇప్పటికే గతంలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో తీవ్ర నష్టాల పాలైన టిఎస్ఆర్టిసి ఇప్పుడు మరోసారి నష్టాల్లో కూరుకుపోతున్నదని  పలువురు భావిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తీసుకున్నట్లు గానే టీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా ఏదైనా ముందడుగు వేసి ఆలోచన చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: