ఈనాటి కాలంలో వైద్య సేవలు మరింతగా మెరుగు పడుతున్నాయి. ఎలాంటి వ్యాధికైనా ఇట్టే  నయం చేసే మందులు ప్రస్తుతం హాస్పిటల్ లో దొరుకుతున్నాయి. రోజురోజుకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ మనుషుల ప్రాణాలకు మాత్రం రక్షణ కరువైంది. డాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇంకా లోకాన్ని  సరిగ్గా కూడా చూడని చిన్నారులు  వైద్యం వికటించి మరణించిన వారు కోకొల్లలు. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలిపోతుంది. నకిలీ మందుల ప్రభావం డాక్టర్ల నిర్లక్ష్యం వెరసి మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

 

 

 అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు కి జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. దీంతో ఆ చిన్నారి కి ఇంజక్షన్ ఇచ్చింది నర్స్ . ఇక నర్స్  ఇచ్చిన ఇంజక్షన్ వికటించి చిన్నారి క్షణాల్లో కోమాలోకి వెళ్లి మరణించింది. దీంతో ఆ తల్లిదండ్రుల రోదనకు  అవధులు లేకుండా పోయాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పసిపాపకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా  అని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటన బెలగావి జిల్లా గోకాక్  తాలూకా హునశ్యాల  బిజీ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...హునశ్యాల బిజీ గ్రామంలో చిన్నారి కి జ్వరం వస్తే చూపిద్దామని అంగన్వాడి సెంటర్ కు తీసుకువచ్చారు తల్లిదండ్రులు.

 

 

 ఇక అక్కడి నర్స్ పెంటపెస్ట్ అనే ఇంజెక్షన్ పాపకు ఇచ్చింది. ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే ఆ చిన్నారి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లి పోయింది. ఇక ఆ తర్వాత కొంతసేపటికి ఆ చిన్నారి మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా అంటు వ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే పెంటపెస్ట్ అనే  ఇంజక్షన్ ఇస్తారు అని... కానీ జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి ఇంజక్షన్లు వాడకూడదని కానీ  నర్స్ చేసిన  పనికి తమ చిన్నారి ప్రాణం పోయింది అంటూ తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. గోకాక్  లోని ఆస్పత్రు ముందు  చిన్నారి మృతదేహాన్ని తీసుకు వచ్చి ఆందోళన చేశారు. నర్సు నిర్లక్ష్యం వల్లే అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు  మరణించిందని అంటూ విలపించారు తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: