ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు పెద్దలు. ఎందుకంటే ఉల్లి తినడం వల్ల అన్ని లాభాలు ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు పోతాయి. అయితే ఈ ఉల్లిపాయ ధరలు నిన్నటి వరుకు భారీగా ఉన్న ఉల్లి ధరలు. ప్రతి ఒక్కరికి ఈ ఉల్లి మంట బాగా అంటుకుంది. 

 

ఇంకా కొంతమంది అయితే ఈ ఉల్లిపాయని కొనడానికి ప్రయత్నించి ప్రయత్నించి గుండెపోటు వచ్చి మరణించారు కూడా. ఇంకా కొంతమంది మహిళలు అయితే ఉల్లి రాయితీ కేంద్రాల ముందు జుట్టు ఊడిపోయేలా కొట్టుకున్నారు. ఆ కొట్టుకోవడం చూస్తే బాబోయ్ అని ఆశ్చర్య పోవాల్సిందే. అలా కొట్టుకున్నారు ఆ మహిళలు. 

 

అయితే ఇక అలాంటి కష్టాలన్నింటికీ ఈరోజుతో చెక్ పడింది.  హైదరాబాద్‌లోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లకు భారీ ఎత్తున ఉల్లి సరఫరా మొదలైంది. గత రెండు నెలలుగా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిపంట పాడైపోవడం వల్ల హైదరాబాద్‌కు ఉల్లిసరఫరా తగ్గింది. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ ఉల్లిపంట ఆశించనంతగా లేక పోవడం, ఉత్పత్తి అయిన ఉల్లిలో చాలా మటుకు వర్షాలకు తడిసిపాడైపోయింది. దీంతో ఉల్లిధరలు భారీగా పెరిగిపోయాయి. 

 

కేజీ ఉల్లిపాయ 200 రూపాయలకి కిలోకు చేరింది. అయితే ఇటీవల మహారాష్ట్రలో కొత్తపంట చేతికి రావడంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు ఉల్లిసరఫరాను ప్రారంభించారు. అలాంటి ఈ ఉల్లి ధర మహారాష్ట్ర పుణ్యమా అని హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఫస్ట్‌క్వాలిటీ ఉల్లిగడ్డ క్వింటాల్‌కు 13వేల నుంచి 14వేల రూపాయలు పలుకుతోంది. 

 

ఇంతగా ఉల్లి ధరలు తగ్గినప్పటికీ సామాన్యుల దగ్గరకు వచ్చేసరికి ఉల్లి ధరలు భారీగానే ఉన్నాయి. షాపుల్లో ఉల్లి ధరలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. భారీగానే అమ్ముతున్నారు.. కేజీ ఉల్లి ధర ప్రస్తుతం 100 రూపాయలకు తక్కువ అమ్మటం లేదు. ఇలా హోల్ సేల్ మార్కెట్ లో ఉల్లి ధరలు తగ్గినప్పటికీ సామాన్యుల వద్దకు వచ్చేసరికి భారీగానే ఉంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: