మీడియా సహజంగా ఏం న్యూస్ కవర్ చేస్తుంది..? ప్రజల కష్టాలు... పాలకుల విధానాలు.. ప్రభుత్వ నిర్ణయాలు.. ఇంకా సమాజంలోని అనేక కోణాలు.. కదా.. ఈ క్రమంలో సహజంగా అధికారంలో ఉన్నవాళ్లు ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. ప్రధానంగా చెప్పాలంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, నాయకులు ఇలా వీరు ఎక్కువగా మీడియాలో ఫోకస్ అవ్వడం సహజం.

 

ఇక వీరందిరిలో సీఎం కు చాలా క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే.. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయమూ రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే సీఎం రోజువారీ షెడ్యూల్ .. ఆయన ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు.. అనేది ఎక్కువగా హైలెట్ అవుతాయి. అయితే ఇదంతా సాధారణ మీడియాకు కానీ.. ఏపీలోని ఎల్లో మీడియాకు మాత్రం ఇవేమీ పట్టవు.

 

వారికి అధికారంలో ఎవరు ఉన్నారన్నది అనవసరం. వాళ్లు ఏం చేస్తున్నారన్నది అనవరసం. వారికి కావాల్సిందే ఒక్కడే.. చంద్రబాబు.. చంద్రబాబు.. తెలుగు దేశం.. అంతే.. అధికారంలో లేకపోయినా సరే.. చంద్రబాబు ఏం చేస్తున్నాడు.. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాడు.. ఆయన ట్విట్టర్ లో ఏం చెప్పాడు.. తెలుగుదేశం నాయకుల షెడ్యూల్ ఏంటి.. వారు ఏం చేయబోతున్నారు. వారు ఏం అన్నారు.. ఇదే ఈ ఎల్లో మీడియాకు ప్రధానం.

 

దీని ఆధారంగానే వారి వార్తలు ఉంటాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే.. అధికారంలో ఎవరున్నా.. ఏమైనా సరే.. చంద్రబాబే మా ప్రయారిటీ.. ఆయన వార్తలే చూపిస్తాం.. సీఎం గా ఎవరున్నా సరే.. మేం 24 గంటలూ ఆయన్నే చూపిస్తాం.. ఇదీ ఈ ఎల్లో మీడియా వైఖరి. అంటే చంద్రబాబు అధికారంలో ఉన్నా.. 24 గంటలూ ఆయన్నే చూపిస్తారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా సరే.. 24 గంటలూ ఆయన్నే చూపిస్తారు. మరి ఇక ఆ మీడియాను ఎల్లో మీడియా అనకుండా ఎలా ఉంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: