ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో  రాజధాని అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే   జగన్మోహన్ రెడ్డి  3 రాజధానుల  ప్రకటన చేసిన నాటి నుండి విపక్ష  పార్టీలన్నీ తీవ్ర స్థాయిలో అధికార వైసీపీ పార్టీపై విమర్శలు చేయడం.. విపక్షాల విమర్శలను  అధికార వైసిపి పార్టీ తిప్పి కొట్టడం. అమరావతి వ్యాప్తంగా రైతులందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ధర్నాలు రాస్తారోకోలు చేయడం. ఇలా రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. రాజధాని అమరావతిలో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాజధాని రైతులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతూ జగన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అమరావతి రైతుల నిరసన కు మద్దతు తెలుపుతున్నాయి. 

 

 

 ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలో నిరసన తెలుపుతున్న రైతులందరికీ మద్దతు తెలుపుతూ రాజధానిని మార్చొద్దు అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. గతంలో కర్నూలు రాజధానిగా కావాలని మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం మాట మార్చారని ఆరోపించారు నగరి ఎమ్మెల్యే రోజా. ఈ రోజు తిరుమల లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మొదట మద్దతు పలికిన బీజేపీ నేతలు రాజధాని విషయంలో యూటర్న్ తీసుకోవడం బాధాకరమని అన్నారు. 

 

 

 సొంత ప్రయోజనాల కోసమే సుజనా చౌదరి సీఎం రమేష్ బిజెపిలో చేరాలని వారికి వైసీపీ ని విమర్శించే అర్హత లేదు అంటూ ఆమె అన్నారు. ఇక టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను రెచ్చగొడుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాజధాని ప్రజలకు నష్టం చేసింది చంద్రబాబేనని... అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు అంటూ ఆమె విమర్శించారు. పంట భూములను తగలబెట్టి రైతులను చంద్రబాబు భయబ్రాంతులకు గురి చేశారని ఆమె చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తున్నారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు అంటూ రోజా ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: