ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేగుతోంది.    సీఎం జగన్ 3 రాజధానుల  ప్రకటన చేసిన నాటి నుండి విపక్ష  పార్టీలన్నీ తీవ్ర స్థాయిలో అధికార వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. విపక్షాల విమర్శలను  అధికార వైసిపి పార్టీ తిప్పి కొడుతున్నాయి.  అమరావతి వ్యాప్తంగా రైతులందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. రాజధాని అమరావతిలో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాజధాని రైతులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతూ జగన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అమరావతి రైతుల నిరసన కు మద్దతు తెలుపుతున్నాయి. 

 

 

 అయితే జగన్మోహన్రెడ్డి 3 రాజధాని నిర్మాణానికి ప్రతిపక్ష పార్టీలైన టిడిపి జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో జగన్ నిర్ణయానికి మద్దతు పలికిన బిజెపి కూడా జగన్  నిర్ణయం విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానిల  ప్రతిపాదన వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా జగన్మోహన్ రెడ్డి సర్కారును ప్రశ్నించారు. విజయవాడలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా జగన్ నిర్ణయం పై పలు విమర్శలు చేశారు.

 

 

 చాలా రాష్ట్రాల్లో  ఒకే రాజధాని ఉందని హైకోర్టు ఇతర చోట్ల ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానిల వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాము  మొదటి నుంచీ కోరుతున్నానని చెప్పారు. మూడు రాజధానిల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డి.రాజా డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ పాలనలోనే వైఫల్యాలపై కూడా తాము పోరాడుతామని party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఈ సందర్భంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: