వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒకే చోట ఖర్చు చేసి నయా జమిందార్లను తయారు చేయడానికి వ్యతిరేకమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటోదని కొడాలి నాని చెప్పారు. 
 
రెండు జిరాక్స్ సెంటర్లు మాత్రమే కర్నూలు జిల్లాలో హైకోర్టు పెడితే వస్తాయని పప్పుగాడు లోకేష్ చెబుతున్నాడని కర్నూలుకు కేవలం రెండు జిరాక్స్ సెంటర్లు వచ్చే హైకోర్టును తీసుకెళితే టీడీపీ నేతలు ఎందుకు గింజుకుంటున్నారని కొడాలి నాని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల కోసం ఎలాంటి లుచ్చా పనులైనా చేయడానికి వెనుకాడడని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొడాలి నాని సూచనలు చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ పదిమందికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఎన్టీయార్ పార్టీ పెట్టారని కానీ ఆ పార్టీని చంద్రబాబు నాయుడు కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం చేశాడని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును వదిలేసి వైసీపీలోకి వస్తామని అంటున్నారని కొడాలి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి వైసీపీలోకి రావాలని చెబుతూ ఉండటంతో వారి ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. 
 
చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను గాలికి వదిలేశాడని అందువలనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తున్నారని అన్నారు. అమాయకుల ప్రాణాలను రాజకీయాల కోసం పణంగా పెట్టటానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతారని అన్నారు. జగన్ ను ఎయిర్ పోర్ట్ రన్ వే మీదే విశాఖలో మార్చ్ చేయడానికి వెళ్లిన సమయంలో అడ్డుకున్న సన్యాసి చంద్రబాబు కాదా అని కొడాలి నాని విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: