సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. పంతంగి, కొర్లపాడు, పొట్టిపాడు టోల్ గేట్ల దగ్గర వాహనాల రష్‌ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఫాస్టాగ్‌ వల్ల టోల్ గేట్ల వద్ద రద్దీ కొంత తగ్గింది. అయితే ఇప్పటికీ చాలా మంది ఫాస్టాగ్ కు అలవాటు పడకపోవడంతో టోల్‌ప్లాజా దగ్గర  వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. 

 

సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్న జనంతో హైదరాబాద్, విజయవాడ హైవేలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపాడు టోల్‌గేట్ల దగ్గర రెండు రోజులుగా రష్ విపరీతంగా పెరిగింది. అటు పంతంగి, ఇటు కొర్ల పహడ్ టొల్ ప్లాజా వద్ద ఊళ్లకు వెళ్లేవారి వాహనాలతో రద్దీగా మారింది. 

 

కొర్లపహాడ్ టోల్ గేట్ లో రద్దీ తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో వాహనదారులకు కొంత ఇబ్బందిగా మారింది. టోల్ ప్లాజాలో మొత్తం 12 టోల్ కౌంటర్లు ఉండగా,  ఇరువైపులా నాలుగు చొప్పున 8 ఫాస్ట్ స్టాగ్ కౌంటర్ లు, 4 కౌంటర్లు నాన్ ఫాస్ట్ స్టాగ్ కౌంటర్లు ఉన్నాయి. 

 

చాలమంది వాహన దారులు పాస్ట్ స్టాగ్ తీసుకోకపోవడంతో, నాన్ ఫాస్ట్ టాగ్ కౌంటర్ల వైపు రద్దీ పెరిగిపోతుంది. ప్రస్తుతం విజయవాడ వైపు 5 ఫాస్ట్ టాగ్, 2 మాన్యువల్ కౌంటర్స్ ఉన్నాయి. ప్రత్యేక మాన్యువల్  మిషన్ లు  పెట్టి వాహనాలను త్వరగా పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు టోల్ సిబ్బంది. 

 

విజయవాడ సమీపంలోని పొట్టిపాడు టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పండగ కోసం ఊర్లకు వెళ్లే వాహనాలతో రద్దీగా మారిపోయింది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. హైదరాబాద్‌ నుంచి కృష్ణా, గోదావరి జిల్లాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో వాహనాల తాకిడి ఎక్కువైందని టోల్‌గేట్‌ అధికారులంటున్నారు.  

 

రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్ లు దొరక్క వాహనాల్లో ప్రయాణం కడుతున్నారు ప్రజలు. దాంతో మరో మూడు రోజుల పాటు ప్రయాణీకుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. రష్ కు తగినట్లు టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని, లేదంటే కిందటేడాదిలానే పండగ మూడ్రోజులు టోల్ వసూలును విరమించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: