తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గానికి ఎస్‌వీబీసీ ఛైర్మన్ పుథ్వీరాజ్ వ్యవహారం తలనొప్పిగా తయారైనట్టుగా కనిపిస్తుంది. ఈ వ్యవహారమంపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో  రాజధాని రైతుల విషయంలో నోరు జారి వివాదాల్లో చిక్కుకున్నప్పుడే సీఎం జగన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే.  ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పృథ్వీవివాదంలో చిక్కుకోవడంతో అధిష్టానం తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.    సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆయన ఆడియో వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి జగన్ అసహనం వ్యక్తం చేసినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.

ఒక సారి ఆయన వ్యాఖ్యలు విందాం..  పృథ్వి నిన్ను వెనక్కి నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకుందాం అనుకున్నా.. లవ్యూ.. ఇలా సదరు మహిళా ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది.. అంతే కాదు.. తాగి మాట్లాడుతున్నారేనన్న సందేహాన్ని మహిళ వ్యక్తం చేయగా.. తాను ప్రస్తుతం మద్యం సేవించడం లేదు.. మళ్లీ తాగడమంటూ జరిగితే నీవద్దే కూర్చొని తాగుతానంటూ... పృథ్వి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఆ  ఆడియో టేపు సొసైల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా రంగంలోకి టీటీడీ విజిలెన్స్ దిగింది. అంతర్గత విచారణ చేపట్టిన విజిలెన్స్.

టీటీడీ విజిలెన్స్. నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ వ్యవహారంపై ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.  మహిళా ఉద్యోగి పట్ల ఆయన అసభ్యంగా మాట్లాడటం దారుణమని ఉద్యోగ సంఘం నేతలు అన్నారు. ఇలాంటి వారిని ఛైర్మన్‌గా కొనసాగించకూడదని కోరారు. ఎస్వీబీసీ ఛాంబర్‌ను తప్పుడు పద్దతులకు వాడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, పృథ్వీరాజ్‌ను తక్షణం ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. 30 మంది ఉద్యోగులను ఆయన ఇష్టానుసారం నియమించారని చెప్పారు. డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: