స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో రాజకీయ పార్టీల మధ్య యుద్ధానికి పచ్చజెండా ఊపుతూ ఎన్నికల నోటిఫికేషన్ పండుగ లోపు వెలువడేలా కనిపిస్తోంది. నోటిఫికేషన్ రేపో మాపో అన్నట్టుగా ఉండడంతో ఈ  యుద్ధంలో ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి మధ్య తీవ్ర స్థాయిలో పోరు ఉండేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి ఎన్నికల సమరం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎంపీటీసీ, జడ్పిటిసి, జెడ్పీ చైర్మన్, ఎంపిపి పదవుల కోసం ఇప్పటి నుంచే పోటీ నెలకొంది. అయితే అంతగా ప్రాధాన్యం ఉన్న ఈ మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నిబంధనలు ఏంటి అనేది చాలా మందికి తెలియదు వాటి గురించి పూర్తి వివరాలు.

 

జడ్పీ జెడ్పీటీసీ గా పోటీ చేయాలంటే ఏ నిబంధనలు ఉన్నాయి ? 


జెడ్పీటీసీ గా పోటీ చేసే అభ్యర్థులు జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.

 జిల్లాలో ఏ మండలం నుంచి పోటీ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక సీట్లో మాత్రమే పోటీ చేసేలా నిబంధనలు రూపొందించారు.

ఎంపీటీసీగా పోటీ చేయాలంటే?

ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ముందుగా పోటీచేసే మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. మండలంలోని ఏ గ్రామం నుంచి అయినా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇక మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు. 

 

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డైరెక్టర్లు, ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు, గ్రామ సేవకులు పోటీచేసేందుకు అనర్హులు.

లంచాలు , అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విధుల నుంచి సస్పెండ్ అయిన ఉద్యోగులు, ఐదేళ్ల కాలపరిమితి వరకు పోటీ చేయకూడదు.

నేరాల్లో శిక్ష పడ్డ వారు శిక్ష ముగిసిన తర్వాత ఐదేళ్ల వరకు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కాదు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలపై గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించాలి.

 

జిల్లా పరిషత్ కు పోటీ చేసేందుకు డిపాజిట్ గా ౫౦౦౦, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 2500 చెల్లించాలి. మండల పరిషత్ కు పోటీ చేసేవారు 2,500 చెల్లించాలి. ఎస్సీ ,ఎస్టీ, బీసీలు 
అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల కోసం బ్యాంకులో ప్రత్యేకత తీయాలి ఆకాశం నుంచి 1250  డిపాజిట్ గా చెల్లించాలి.

 ఎన్నికల ఖర్చు పెట్టేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాలి. ఈ విధంగా ఎన్నికల సంఘం నిబంధనల ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: