విశాఖలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. 98వార్డులతో జంబో గ్రేటర్ నగరంగా ఆవిర్భవించిన జీవీఎంసీలో... ఓటర్ల తుది జాబితా తయారుచేసి, రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలెట్టారు.

 

ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా చేయాలని భావిస్తున్న తరుణంలో.. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్ధ, లోకల్‌ ఎలక్షన్స్‌కు రెడీ అవుతోంది. అయితే జీవీఎంసీ స్వరూపం మరోసారి మారింది. భీమిలి వైపున్న కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, నగరపాలెం, జేవీ అగ్రహారం పంచాయతీలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఐదు గ్రామ పంచాయితీల విలీనం తర్వాత వార్డుల సంఖ్య 72నుంచి 98కి పెరిగింది. 

 

అనకాపల్లి, భీమిలి ప్రాంతాలను కలుపుతూ జంబో గ్రేటర్ నగరంగా ఏర్పడిన విశాఖ నగర పాలక సంస్ధకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు వేగవంతం చేసింది ప్రభుత్వం. 2011 జనాభా లెక్కల ప్రకారం.. వార్డుల పునర్విభజన ప్రక్రియకు అవసరమైన సమాచారం ఇప్పటికే జీవీఎంసీ సేకరించింది. వార్డుల స్వరూపం, సరిహద్దులతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. వార్డుల విభజనకు ఆమోదం లభించడంతో పాటు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 16వరకు డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి జాబితా రెడీ చేయాలని జీవీఎంసీని మున్సిపల్ శాఖ ఆదేశించింది.

 

అనకాపల్లి నుంచి భీమిలి వరకు విస్తరించిన జీవీఎంసీలో 19 లక్షల మంది జనాభా ఉంది. గ్రేటర్ స్వరూపం మారడంతో ఇప్పుడు రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. వార్డుల వారీగా, సామాజికవర్గాల వారీగా జనగణన రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నెల 16 వరకు ఇంటింటికీ వెళ్లి సామాజిక వర్గాల వారీగా జనాభా వివరాల సేకరణ జరగనుంది. మొత్తానికి విశాఖలో జరిగే మున్సిలప్ ఎన్నికలపై అంతా ఉత్కంఠ నెలకొంది. జగన్ నిర్ణయం విశాఖను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అందరూ భావిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: