ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల  ప్రకటన చేసిన తర్వాత రాజధాని అమరావతి లో రైతులు నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. రాజధాని అధ్యయనం కోసం నిర్మించిన రెండు కమిటీలు జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదిక అందించడంతో రాజధాని రైతులందరూ నిరసనలు మరింత ఉధృతం చేశారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి లో రైతులు చేస్తున్న నిరసన పై స్పందించిన సినీ నటుడు ఎస్వి బిసి చైర్మన్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి లో నిరసన తెలుపుతున్న వారు అసలైన రైతులు కాదని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

 కాగా పృథ్వి చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలిసిందే. రాజధాని రైతులు ఆందోళనలో పెయిడ్  ఆర్టిస్టులతో పాటు కొన్ని కులాల వారే  ఆందోళన చేస్తున్నారని పృథ్వీ కామెంట్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే వైసీపీ పార్టీకి సపోర్ట్ గా ఉండే సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా.. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టగా..  పృథ్వి పోసాని పై కూడా సీరియస్ అయ్యారు. దీంతో పృద్వి  వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఇప్పటికీ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే పృద్వి రైతుల పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వైసీపీకి మరింత డామేజ్ జరిగిందని వైసిపి వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 

 

 

 అయితే పృద్వి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం . తాజాగా పృథ్వీ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాస్త సీరియస్ అయ్యాడట. సబ్జెక్టు మాట్లాడాలి తప్పితే కులాల ప్రస్తావన ఎందుకు అంటూ సీఎం జగన్ పృధ్విని మందలించినట్లు వైసిపి వర్గాల నుంచి సమాచారం. రైతులపై నోటికొచ్చినట్లు కామెంట్ చేయడం సరైన పద్ధతి కాదని మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జగన్ పృధ్విని కాస్త ఘాటుగానే మందలించారట . ఇప్పుడు కులాల ప్రస్తావన తెచ్చి ఏ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని... పృథ్వీ తో పాటు వైసిపి నేతలందరికీ ఆదేశాలు జారీ చేశారట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సీఎం ఆగ్రహంతో పృద్వి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రైతుల గురించి తప్పుగా మాట్లాడలేదని ఇంకెప్పుడూ మాట్లాడను అని పృథ్వి తాజాగా స్పష్టం చేశారు. బినామీలు చేస్తున్న దౌర్జన్యం మీదే మాట్లాడాను అని.. రైతులు అర్ధం చేసుకోవాలని పృద్వి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: