ఎస్వీబీసీ ఛైర్మన్, సినీ నటుడు పృథ్వీపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వైసీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పృథ్వీ అమరావతిలో ఒక కులానికి చెందిన మహిళలను తిట్టిపోశాడని పోసాని కృష్ణ మురళి ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ వివాదం మరవకముందే సోషల్ మీడియాలో ఒక ఆడియో బయటకు రావడంతో వివాదం చెలరేగుతోంది. ఇది తన వాయిస్ కాదని పృథ్వీ ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ ఈ వివాదం మాత్రం ముదురుతోంది. 
 
సీఎం జగన్ పృథ్వీపై ఆగ్రహం వ్యక్తం చేయటానికి ఈ వివాదాలు మాత్రమే కాకుండా వైవీ సుబ్బారెడ్డి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితులతో వైవీ సుబ్బారెడ్డి గురించి ఇష్టానుసారం మాట్లాడారని, ఎస్వీబీసీ ఉద్యోగులను కూడా తీసివేసి కొత్తవారిని నియమించాడని డబ్బులు తీసుకొని కొత్తవాళ్లను నియమించాడని కూడా పృథ్వీపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
వైవీ సుబ్బారెడ్డి సన్నిహితులే ఈ ఆడియోలు, వీడియోలు విడుదల చేశారని కూడా వారి కొంతమంది అనుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి కూడా పృథ్వీ గురించి జగన్ తో మాట్లాడారని అందువలనే జగన్ పృథ్వీపై ఆగ్రహం వ్యక్తం చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ఆడియో టేపు గురించి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే కులాల ప్రస్తావన ఎందుకని పృథ్వీరాజ్ ను జగన్ మందలించినట్టు ఇలాంటివి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది. 
 
ఇలాంటి సమయంలో పృథ్వీ మాట్లాడాడంటూ ఒక సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో పృథ్వీది తప్పు ఉందని తేలితే మాత్రం అతని పదవి పోవడం ఖాయమేనని తెలుస్తోంది. పృథ్వీ పదవి గురించే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం మహిళ కావాలనే ఈ విధంగా చేసిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పృథ్వీ పద్మావతీ గెస్ట్ హౌస్ లో మద్యం కొడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కందారపు మురళి చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: