ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో అందరూ చర్చించుకుంటున్న అంశం ఒక్కటే అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల ప్రకటన గురుంచే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల  ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. ఇప్పటికే టిడిపి జనసేన నేతలు అందరూ తీవ్రస్థాయిలో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో  కూడా రైతులందరూ నిరసన బాట పట్టి రోజురోజుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు కూడా ప్రతిపక్షాల విమర్శలను ఎండగడుతూ... కౌంటర్ ఇస్తున్నారు. ఇలా మొత్తం ఆంధ్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అమరావతి లో నిరసన తెలుపుతున్న రైతులందరికీ ప్రతిపక్ష టీడీపీ మద్దతు తెలుపుతుంది.  

 

 

 ప్రతిపక్ష పార్టీలన్ని  రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్.. రాజధాని అమరావతిలోని కొనసాగించాలని బీజేపీ కోర్ కమిటీ తీర్మానం చేయడం పై స్పందిస్తూ విమర్శలు చేశారు. అమరావతి నిర్మాణానికి అయ్యే లక్ష కోట్లు ఖర్చు బిజెపి ఇస్తే అమరావతిలోనే  రాజధాని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.మూడు  రాజధానిల వద్దని చెబుతున్నా కన్నా లక్ష్మీనారాయణ... కేంద్రం నుంచి అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కన్నా లక్ష్మీనారాయణ పేరిట రాజధాని నిర్మిస్తామని సెటైర్లు వేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. 

 

 

 రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆనాడు  టీడీపీ  బీజేపీలు కేంద్రానికి చెప్పలేదా అని ప్రశ్నించిన మంత్రి వెల్లంపల్లి... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై  తీవ్ర విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎలాంటి విజన్  లేదని కేవలం ప్యాకేజీ ఇస్తే చాలు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని  వెల్లంపల్లి తెలిపారు. రైతులకు అన్యాయం జరగదని చంద్రబాబు ఉచ్చులో పడొద్దని   రాజధాని రైతులందరికీ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: