ఆయన గారు పే.... ద్ద జర్నలిస్టే కాదు అతి పెద్ద మీడియా సామ్రాజ్యానికి అధిపతి. అంతే కాదు నిత్యం ఆయన ఛానల్, పేపర్ లో ఈయన గారు నీతులు చెబుతూ ఈ సభ్య సమాజాన్ని నేనొక్కడినే ఉద్ధరిస్తున్నా అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఒకటే కథనాలు ప్రచారం చేసేస్తుంటారు. ఇదంతా చూసి నిజంగా ఆయన గారు ప్రపంచ మేధావి అనుకుని కొంతమంది బ్రహ్మ పడిపోతుంటారు. మొన్నటి వరకు ఆయన బాస్ పాలన ఉండడంతో బాగానే వెనకేసుకున్నారు. అంతేనా ఆయన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెడుతున్నాడు అన్నట్టుగా ఒకటే ఊదరగొట్టే వార్తలతో భజన చేయడం లో ఆయనకు మించిన వారు ఉండనే ఉండరు. ఇక రెండు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న బిరుదులు చాలానే ఉన్నాయి. మొన్నటి ప్రభుత్వంలో ఆయన భజన మరీ ఎక్కువ అయ్యిందనే ప్రచారం జరిగింది. 


ఆయన చేస్తుంది జర్నలిజమా లేక బ్రోకరిజమా?  లేక ఓ పార్టీకి కరపత్రికా ?అన్న రేంజ్ లో ఆయన బరితెగించి మరీ సపోర్ట్ చేస్తూనే వస్తున్నాడు. ఇక కొత్తగా జగన్ ప్రభుత్వం అధికారం లోకి రావడంతో ఈయన బాధ అంతా ఇంతా కాదు. రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగా పోకుండా జగన్నమ స్మరణలో మునిగి తేలుతూ రోజు రోజుకి బక్క చిక్కిపోతూ ఢీలా పడిపోతున్నాడట. దీనికి తగ్గట్టుగానే జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకువెళ్తుండడం కిట్టూకి మరింత కడుపు మంట కలిగిస్తుందట. ఏదో ఒకరకంగా అర్జెంట్ గా బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కిట్టూకి అమరావతిలో అంటుకున్న రాజధాని మంటలు బాగా చలికాచుకోవడానికి పనికి వస్తున్నాయి. 

 

ఇక అదే పనిగా పంచర్ పడ్డ తన బాస్ సైకిల్ కి ప్యాచీలు వేయడం మొదలు పెట్టాడు. అయినా ఆ పాడు సైకిల్ కుర్రో మొర్రో అంటూ కుని రాగాలు తీస్తుండడంతో రిపేర్ లు మొదలుపెట్టాడు. తిన్నా, కూర్చున్నా, పడుకున్నా, జగన్ నామస్మరణ చేస్తూ నిద్ర కూడా పోకుండా అర్జెంట్ గా ఏదో ఒకటి చేసెయ్యాలనే కసి తో ఒళ్ళంతా మసి పూసుకునేందుకు సిద్ధం అయిపోయాడు. ఆ కసి తోనే జగన్ ప్రభుత్వం పై కొత్త కొత్త వంటకాలు రెడీ చేస్తూ తన మీడియాలో వదిలేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాను ఎంత చేస్తున్నా సైకిల్ కి మైలేజ్ రావకపోవడంతో ఈయన గారి బాధ అంతా ఇంతా కాదు. 


అందుకే  అమరావతికి కుల ముద్ర వేసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇదేదో కమ్మ రెడ్ల మధ్య ఆధిపత్య పోరుగా ఆయన చిత్రీకరిస్తూ జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆయన గురించి ఏపీ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి జనాల చెవులు ఊదరగోట్టేలా జగన్ ప్రభుత్వంపై ఆయన ఎంత విషం చిమ్మినా నమ్మే వారు ఎవరు ? ఆయన మాటలు గుర్తుపెట్టుకుని వారు ఎవరు ? ఇప్పటికైనా ప్రశాంతంగా నిద్రపోవాలంటే నిజాన్ని నిర్భయంగా చెప్పు అప్పుడే నీకు మనశాంతీ .. సుఖ నిద్ర వస్తుంది. బాయ్ బాయ్ బాధ కిట్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: