జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా తెరవెనుక జరుగుతున్న కుట్రను రాధాకృష్ణే తన చెత్తపలుకులో బయట పెట్టేసుకున్నారా ? ప్రతి ఆదివారం అచ్చేసొదిలే చెత్తపలుకులో  జగన్ ప్రభుత్వం తొందరలోనే కూలిపోవాలన్న తన ఆకాంక్షను బయటపెట్టుకున్నారు. జగన్ జైలుకు వెళ్ళాలని,  ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలో గొడవలు మొదలవ్వాలని, జగన్ కుటుంబంలో కూడా చీలికలు రావాలనే తన కోరికలను నిసిగ్గుగా ఈ సీనియర్ పాత్రికేయుడు తనంతట తానే బయటపెట్టుకున్నారు.

 

అవినీతి కేసుల్లో జగన్ జైలుకు వెళ్ళాల్సొస్తే ఆయన స్ధానంలో ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే విషయంలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య పోటి మొదలైందని ఈయనగారు చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజంగా ఆ పరిస్ధితే వస్తే తన తరువాత ఎవరు సిఎంగా ఉండాలో జగన్ నిర్ణయించకుండానే ఉంటారా ? జగన్ చేసిన నిర్ణయాన్ని ధిక్కరించే వాళ్ళు ఎవరుంటారు ?

 

ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేయాల్సొస్తే తన స్ధానంలో భార్య  భారతిని నియమించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారట. అదే జరిగితే అప్పుడు పార్టీలో చీలిక వస్తుందని వైసిపిలోని ఓ ప్రముఖుడు అంచనా వేశారని రాధాకృష్ణ చెప్పటమే విచిత్రంగా ఉంది.  భారతిని సిఎంగా చేయాలని జగన్ నిర్ణయిస్తే కాదనే వాళ్ళు ఎవరుంటారు ?  వైసిపి తరపున గెలిచిన 151 మందిలో దాదాపు 110 మంది కేవలం జగన్ రెక్కల కష్టంతోనే గెలిచారనటంలో సందేహమే లేదు.

 

 పైగా భారతికి షర్మిలకు మధ్య ఏమాత్రం పొసగటం లేదని కూడా రాధాకృష్ణ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళిద్దరికీ పడటం లేదు కాబట్టి కుటుంబంలో కూడా చీలిక వస్తుందట. కుటుంబంలో వచ్చే చీలిక వల్లే పార్టీ కూడా చీలిపోతుందని ఎవరో ప్రముఖ నేత జోస్యం చెప్పారని ఈయనగారు చెప్పారు. కుటుంబంలోని ఇద్దరికి పడకపోతే దాని ప్రభావంతో పార్టీ ఎలా చీలిపోతుందో రాధాకృష్ణే చెప్పాలి. ఎందుకంటే రాధాకృష్ణ చెబుతున్న ఆ ఇద్దరికీ పార్టీతో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి సంబంధాలు లేవు. కుటుంబంలో ఎంతమందున్నా అంతిమంగా జగన్ నిర్ణయమే ఫైనల్ అని తెలీదా ?

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ జైలుకు వెళ్ళాలని, పార్టీలో చీలిక రావాలని, ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి కావాలన్న తన ఆలోచనలను రాధాకృష్ణ బయటపెట్టేసుకున్న విషయం తెలిసిపోతోంది.  చూద్దం ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: