మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. మున్సిపోల్స్ లో ప్రచారం పై సోషల్ మీడియా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేందుకు టిఆర్ఎస్ రేపు  సమావేశం ఏర్పాటు చేసింది. కేటీఆర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అవుతారు.

 

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారంపై దృష్టి పెట్టింది టీఆర్ఎస్. ఓ వైపు ఇంటింటి ప్రచారం చేస్తూ... ఓట్లరను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకొని ఓట్లు రాబట్టాలన్నది గులాబి దళం వ్యూహం.   

 

ఎన్నికలు జరుగుతున్న 120 మున్సిపాలిటీలతో పాటు పది కార్పొరేషన్లు అర్బన్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాలే. దీంతో ఓటర్లను చేరుకోవడానికి సోషల్ మీడియా సరైన మార్గమని భావిస్తోంది టీఆర్ఎస్. దీని కోసం 200 మంది trs సోషల్ మీడియా కార్యకర్తలతో తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు.

  

కొద్ది నెలలుగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేస్తోంది టీఆర్ఎస్. సోషల్ మీడియా కార్యకర్తలతో జరిగే సమావేశంలో ప్రచార సరళిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు ఎలా పనిచేయాలి... ఏయే అంశాలపై ఫోకస్‌ పెట్టాలో చెప్పనున్నారు. సోషల్ మీడియా ద్వారా ఓటర్లకు చేరువ కావాలని ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలను టీఆర్ఎస్ ఆదేశించింది.    

 

మొత్తానికి సోషల్ మీడియాలో విపక్షాలపై చేయి సాధించాలని భావిస్తోంది టీఆర్ఎస్. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రత్యర్థులకు చెక్‌ పెట్టాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై నిర్వహించే రేపటి సమావేశం టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: