అమ్మాయిలు అంటే బుద్దికి, ఒద్దికకు నిదర్శనం అని చెబుతారు. కాని ఈ కాలం అమ్మాయిలు చేసే చేష్టలు వెగటుగా ఉంటున్నాయని తెలిసిందే. సరే వారి చిలిపి చేష్టలు ఇతరులకు ఇబ్బంది కలుగనంత వరకు ఫర్వాలేదు. కాని వారు చేసే పనివల్ల ప్రాణాలకు ప్రమాదం సంభవిస్తుందని అనుకున్నప్పుడు మాత్రం ఎవరు ఇలాంటి వారిని క్షమించరు..

 

 

ఇకపోతే ఈ కాలంలో మంచివారుగా ఉంటూనే, కొందరు తెలియకుండా సైకో లక్షణాలు కలిగి ఉంటున్నారు. ఇదిగో ఇప్పుడు ఒక యువతి, ప్రమాదమని తెలిసి చేసిన నిర్వాకానికి  కోల్ కతా ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్‌ ఏషియన్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

 

 

ఇంతకు ఆమె చేసిన పని తెలిస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.. అదేమంటే తన శరీరంలో బాంబు ఉందని, దానిని ఏ క్షణంలోనైనా పేల్చేస్తానని బెదిరించడంతో కంగుతిన్న ఫైలెట్‌.. విమానాన్ని కోల్‌కతాఎయిర్‌ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఇలా చేయదం ఎంత ప్రమాదకరమో తెలుసుకోలేని స్దితిలో లేని వయస్సుకాదు.

 

 

ఎందుకంటే ఆమె వయస్సు 25 సంవత్సరాలు. ఇంత మొండిగా ప్రవర్తించిన ఆవిడ పేరు. మోహిని మొండల్‌.. ఇక జరిగిన విషయాన్ని చూస్తే. మోహిని ఎయిర్‌ ఏషియన్‌ విమానంలో శనివారం రాత్రి 9 గంటల, 57 నిమిషాలకు కోల్‌కతా నుంచి ముంబై బయలు దేరింది. అయితే మార్గమద్యలో తన కేబిన్‌ సిబ్బందికి ఒక లెటర్‌ ఇచ్చి అది ఫ్లైట్‌ కెప్టెన్‌కు అందివాల్సిందిగా కోరిందట. ఆ లెటర్ అందుకున్న పైలెట్ దాన్ని చదివి షాకైయ్యాడట. అందులో ఏముందంటే..

 

 

తన శరీరం చుట్టూ బాంబులు ఉన్నాయని, వాటిని ఏ క్షణమైనా పేల్చేస్తానని లేఖలో హెచ్చరించిందట. వెంటనే తేరుకున్న పైలట్‌.. తన పై అధికారులకు సమాచారం అందించగా వచ్చిన ఆదేశాల మేరకు కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

 

 

అనంతరం మోహిని మెండల్‌ను ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని, విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శనివారం రాత్రి 11.46 గంటలకు తిరిగి పంపించారట. కాగా, పైలెట్‌ను భయపెట్తిన మోహిని శరీరంలో బాంబు లేదని, ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో  విచారణలో తేలుతుందని అధికారులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: