ప్రముఖ కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ తాను పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని అన్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. తన వాయిస్ ను మార్ఫింగ్ చేశారని పృథ్వీ అన్నారు. తాను రైతు కుటుంబం నుండి వచ్చానని పృథ్వీ అన్నారు. రైతు సోదరులు నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పృథ్వీ అన్నారు. బినామీ ముసుగులో ఉన్న రైతుల గురించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని పృథ్వీ అన్నారు.
 
కడుపుకు నేను అన్నమే తింటానని నేను రైతుల గురించి అలాంటి వ్యాఖ్యలు చేయనని పృథ్వీరాజ్ అన్నారు. నేను శబరిమలనుండి వచ్చే సమయంలోనే నాపై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని మీడియా మిత్రులు అన్నారని చెప్పారు. అప్పుడు తాను స్కాములు చేశానా...? హత్యలు చేశానా...? నా మీద ఏం ప్లాన్ చేస్తున్నారని అడిగానని దానికి వారు మీ వాయిస్ కొంతమంది తమకు అడ్డం అని అనుకుంటున్నారని తనను పాతాళానికి తొక్కేయాలని, ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిలో ఉంచకూడదని ప్లాన్ జరుగుతుందని చెప్పారని పృథ్వీ అన్నారు. 
 
తాను స్వామిని నమ్మాను కాబట్టి ఆ విషయాలను పట్టించుకోలేదని కానీ ఇంతవరకు దారి తీస్తుందని తాను అనుకోలేదని అన్నారు. నా బంధువులు, చుట్టాలు అందరూ బాధపడుతున్నారని తాను కూడా ఈరోజు కన్నీటి పర్యంతమయ్యానని పృథ్వీ అన్నారు. 270 ఎస్వీబీసీ ఉద్యోగులలో ఏ ఒక్కరు కూడా ఏరోజు తనపై ఫిర్యాదు చేయలేదని పృథ్వీ అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలకు చాలా బాధ పడుతున్నానని పృథ్వీ అన్నారు. 
 
డాక్టర్లు వచ్చి బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తే గత 9 నెలల నుండి తాను తాగానా...? లేదా..? అనే విషయం తెలుస్తుందని పృథ్వీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాను మద్యం మానేశానని పృథ్వీ అన్నారు. అలాంటి నాపై పద్మావతి గెస్ట్ హౌస్ లో కూర్చుని మందు తాగుతున్నారని ఆరోపణలు చేయడం దారుణం అని అన్నారు. తాను ఒక్క రూపాయి తిన్నా తాను నాశనమైపోతానని పృథ్వీ అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: