సినీ న‌టుడు పృథ్వీ తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఆయ‌న ఎస్వీబీసీ చైర్మ‌న్ గా ఆయ‌న గ‌త కొంత‌కాలంగా విధులు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న ఓ మ‌హిళ‌తో అస‌భ్యంగా మాట్లాడిన మాట‌లు ఆడియో టేపుల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న ఆయ‌న పై అధికారి ఏపీ సీఎం జ‌గ‌న్ దృష్టికి వెళ్ళ‌డంతో దీని పై సీరియ‌స్ రియాక్ష‌న్ తీసుకోవ‌డం జ‌రిగింది. దీంతో ఆయ‌న ఎస్వీబీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి పృధ్వీ రాజీనామా చేశారు. ఈ రాజీనాయ విష‌యాన్ని స్వ‌యంగా మీడియా స‌మ‌క్షంలో ఆయ‌నే తెలిపారు. అదే విధంగా రైతులంద‌రినీ ఆయ‌న పెయిడ్ ఆర్టిస్టుల‌ని అన‌లేద‌ని కూడా ఈ సంద‌ర్భంగా తెలిపారు. 

 


ఈ వ్య‌వ‌హారాన్ని టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి, సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో వైసీపీ నుంచి ఆదేశాలు రావడంతో పృథ్వీ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రాజీనామా విషయాన్ని మీడియా సమావేశంలో పృథ్వీ స్వయంగా వెల్లడించారు. ఏన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని, పార్టీ అధ్యక్షుడి మాటను గౌరవించి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అసలా ఆడియోలో ఉన్న వాయిస్.. తనది కాదని తెలిపారు. అయితే ఆ ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తేల్చిచెప్పారు. కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తనకు మహిళలంటే అపార గౌరవమని, ఇంతవరకు ఆడవారి పట్ల ఏ రోజూ అసభ్యంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

 


టీటీడీ విజిలెన్స్‌ కూడా విచారణ చేపట్టింది. ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయనను విచారించి.. పలువురు సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. మరోవైపు తనకు ఎస్వీబీసీ ఛైర్మెన్‌గా వచ్చిన అవకాశం చాలామందికి నచ్చడం లేదని, అందులో భాగంగానే తాజా ఆడియో టేపు లీకేజీ వ్యవహారం వచ్చినట్లు.. పృథ్వీరాజ్ చెబుతున్నారు. అలాగే  రైతులందరినీ పెయిడ్‌ ఆర్టిస్టులని తాను అనలేదని చెప్పారు. ఫేక్‌ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దీనివల్ల తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని ఆవేదన వ్యక్తం కూడా వ్య‌క్తం చేశారు. ఇక అస‌లు విష‌యం ఏమిట‌న్న‌ది నిజ నిజాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: