ప్రముఖ కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో పృథ్వీ స్వయంగా రాజీనామా విషయాన్ని వెల్లడించారు. పార్టీ అధ్యక్షుని మాటకు గౌరవం ఇచ్చి తాను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశానని ఎన్నో ఏళ్లుగా తాను పార్టీ కోసం పని చేశానని పృథ్వీ అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులని రైతులందరినీ తాను అనలేదని పృథ్వీ అన్నారు. 

 

తనపై ఫేక్ వాయిస్ తో దుష్ప్రచారం చేస్తున్నారని పృథ్వీ ఆరోపణలు చేశారు. స్నేహితులు, కుటుంబం తనపై వచ్చిన ఆరోపణల వలన బాధ పడ్డారని పృథ్వీ అన్నారు. పద్మావతి గెస్ట్ హౌస్ లో తాను మందు కొట్టానంటూ దుష్ప్రచారం చేశారని అన్నారు. పోసాని చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ తనను పోసాని ఎందుకు అలా అన్నాడో తనకు తెలియదని పృథ్వీ చెప్పారు. తాను పోసాని, మంచి స్నేహితులమని పృథ్వీ అన్నారు. 
 
అనవసరంగా పోసానికి, తనకు మధ్య గొడవలు పెట్టారని పృథ్వీ చెప్పారు. పోసాని తనపై విమర్శలు చేసినా తనకు ఎలాంటి బాధ లేదని పృథ్వీ అన్నారు. పోసాని తనకు అన్నలాంటి వాడు అని పృథ్వీ చెప్పారు. నాగార్జున యూనివర్సిటీలో పోసాని డబుల్ ఎం.ఏ చేశారని తాను ఆంధ్రా యూనివర్సిటీలో ఏం.ఏ చేశానని పృథ్వీ చెప్పారు. పోసాని ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడని రైతులకు, పోసానికి సంక్రాంతి శుభాకాంక్షలు అని అన్నారు. 
 
తన మీద వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని పోసాని అన్నారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో పంపించానని తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పృథ్వీ చెప్పారు. రేపటినుండి అందరినీ కడిగిపారేస్తానని అన్ని శక్తులూ ఒక్కటై తనను ఇరికించాయని పృథ్వీ అన్నారు. మద్యం తాగినట్టు నిరూపిస్తే తనను చెప్పుతో కొట్టాలని పృథ్వీ చెప్పారు. పృథ్వీ తన నిజాయతీని నిరూపించుకుని పదవిలో చేరతానని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: