మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం హైదరాబాదులోని భాజపా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముందే కార్యకర్తలు గొడవకు దిగారు. నిజామాబాద్ నుంచి వచ్చిన భాజపా నేతలు, కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాదు లో ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నారంటూ... ఆందోళన చేపట్టారు. ఎంపీ అరవింద్, బసవ లక్ష్మీనారాయణ మునిసిపల్ ఎన్నికల టికెట్లను టికెట్లను అమ్ముకున్నారని కార్యకర్తలు బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్‌కు ఎదుట ఆరోపించారు. దాంతో లక్ష్మణ్ ఎంత సర్ది చెప్పినా పట్టించుకోని కార్యకర్తలు తమకి న్యాయం జరగాలి అంటూ గట్టిగా నినాదాలు చేశారు.


నిజామాబాద్ అర్బన్ లో ఒక మహిళకు వచ్చిన ఓ టిక్కెట్ ను వేరే వాళ్లకు ఇవ్వడంతో ఆందోళనలకు దిగారు మహిళలు. కష్ట పడిన వారికి కాకుండా కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని తిట్టిపోశారు. ఎస్టీ జనరల్ టికెట్ ను మహిళకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.


సుగుణ అరుణ మాట్లాడుతూ... తను 2014లో బిజెపి పార్టీలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని.. అయినా 6సంవత్సరాల నుండి నిర్విరామంగా పార్టీ కోసం పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. 'బిజెపి పార్టీలో నేను ఏకైక మహిళా ఎస్టీ ని నేనే. 6 నెలల క్రితం నాకు టికెట్ ఇస్తానని చెప్పారు. కానీ రెండు రోజుల కింద వేరే వాళ్ళు ఎవరికో కాంగ్రెస్ అతనికి, టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. మహిళలకు గౌరవం లేదా, మా ఎస్సీ, ఎస్టీ వాళ్లకు విలువ లేదా, మేమంటే మీకు అంతా చులకనా?', అంటూ ఆమె ప్రశ్నించారు.


మహిళలకు టికెట్ ఇవ్వమని చెబితే తాను ఏమననని, ఎటువంటి గొడవలు చేయనని కేవలం బీజేపీ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. టికెట్ ఇస్తానని ఇవ్వకుండా తమ మనోభావాలను బాగా దెబ్బతీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. చివరగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ లకు గౌరవమివ్వమని అలా అయితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: