ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రకటన ఆంధ్ర రాజకీయాలు సంచలనం సృష్టించింది. తదనంతరం ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో 3 రాజధానిలు  ఏర్పడే అవకాశం ఉందని ప్రకటన చేయడం... ఆ తర్వాత రాజధాని అధ్యయనం కోసం ప్రభుత్వం నిర్మించిన రెండు కమిటీలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదికలు అందించడంతో ... ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి . ఇక అమరావతిలో మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు అమరావతి రైతులు. అమరావతి రైతులే కాకుండా రైతు కుటుంబం మొత్తం రోడ్ల పైకి చేరి తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. ఇక అమరావతి రైతుల ఆందోళన తో అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. 

 

 

 రాజధాని రైతుల నిరసనలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా  టిడిపి అధినేత సతీమణి నారా భువనేశ్వరి కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తూ రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతున్నారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోలిపట్టి అమరావతి పరిరక్షణ సమితి పేరిట విరాళాలు సైతం సేకరిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అమరావతి పరిరక్షణ సమితి కి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

 

 

 అంతేకాకుండా రైతులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు  అంటూ అధికార పార్టీపై విమర్శలు కూడా చేసింది నారా  భువనేశ్వరి. ఇక తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. తాము సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఆదివారం నాగులమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. ఆనావాయితి తప్పకూడదనే ఉద్దేశంతోనే మొక్కులు చెల్లించుకున్నామని ఆమె తెలిపారు. అమరావతి రైతులందరూ బాధలో ఉంటే మేము  పండుగ ఎలా జరుపుకుంటాము... సంక్రాంతి పండుగ జరుపుకోకుండా రైతులకు మద్దతు తెలుపుతాము నారా  భువనేశ్వరి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: