ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని పార్టీలలో అలజడి సృష్టిస్తున్న అంశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో 3 రాజధానిలు  ఏర్పడే అవకాశం ఉందని ప్రకటన చేయడం... ఆ తర్వాత రాజధాని అధ్యయనం కోసం ప్రభుత్వం నిర్మించిన రెండు కమిటీలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదికలు అందించడంతో... ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి . ఇక అమరావతిలో మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు అమరావతి రైతులు. అమరావతి రైతులు కాకుండా రైతు కుటుంబం మొత్తం రోడ్ల పైకి చేరి తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. 

 

 

 ఇక అమరావతి రైతుల ఆందోళన తో అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి రైతుల నిరసన దీక్షకు మద్దతు తెలుపుతున్నది . టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తూ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా  అమరావతిని కొనసాగించాలని ఎట్టి పరిస్థితుల్లో మార్పు చేస్తే ఊరుకోం అంటూ హెచ్చరిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జోలు పట్టి  విరాలాలు  సైతం సేకరిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు కూడా ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతున్నారు. 

 

 

 ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల ప్రకటనపై టిడిపి సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పందించి విమర్శలు చేశారు. పిల్ల చేష్టలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు చేస్తే అగ్గి  రావడం ఖాయమని జేసీ వ్యాఖ్యానించారు. రాయలసీమ ఉద్యమం రావడం తథ్యమని జేసీ తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు కలలు కంటూనే ఉంటారు అని వ్యాఖ్యానించిన జేసి.. నది ఒడ్డున ఏర్పడిన పట్టణాలు బాగా అభివృద్ధి చెందుతాయి అంటూ వ్యాఖ్యానించారు. 73 సంవత్సరాల నుండి అమరావతి కి ఎప్పుడు వరదలు రాలేదని తెలిపారు. తనను  ఆర్థికంగా దెబ్బ తీసి రోడ్డుపై నిలబెట్టాలి అనుకుంటున్నారు అంటూ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: