హిందువుల పండ‌గ‌ల‌న్నిలోనూ సంక్రాంతిని పెద్ద పండ‌గ అంటారు. ఈ పండుగ‌ను ఏకంగా మూడు రోజుల పాటు చేస్తారు. ఒక‌టి భోగి, రెండు మ‌క‌ర‌సంక్రాంతి, మూడు క‌నుమ ఈ మూడు రోజులు కూడా సిటీలో ఉన్న‌వాళ్ళంతా వారి వారి సొంత ఊరికి వెళ్ళి చేసుకుంటారు. ఇక ఈ మూడు రోజుల కోసం గ‌త ఆరు నెల‌ల నుంచే మంచిగా ప్లానింగ్ చేసుకుని ఊళ్ళ‌కు రైళ్ళు, బ‌స్సులు రిజ‌ర్వేష‌న్లు చేసుకుంటారు. ఇక ఈ పండ‌గ స‌మయంలో అంద‌రూ ఊళ్ళ‌కి ప‌య‌నిస్తుంటే దొంగ‌లు మాత్రం ఎప్పుడెప్పుడు ఇళ్ళు కాళీ అవుతాయా అని వాళ్ళ ప‌ని మీద వాళ్ళు ఉంటారు. 

 

ఒకవైపు స్థానిక దొంగలు, మరోవైపు అంతర్‌రాష్ట్ర ముఠాలు కలిసి నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే నగరంలో తిష్టవేసి రూ.4కోట్లు కొల్లగొట్టిన చంబల్‌లోయ ముఠాను హైదరాబాద్‌ సిటీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఒకవైపు నేపాల్‌ ముఠా, మరోవైపు బిహార్‌, ఇంకోవైపు ప్రతి ఏటా నగరంలో దర్శనిమిచ్చే చెడ్డీగ్యాంగ్‌లు నగరంలో మకాం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి తోడు స్థానిక దొంగల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రాజేంద్రనగర్‌ పరిధిలో ఇటీవ‌లె దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎం సెంటర్‌లో చోరీ చేయడానికి విఫలయత్నం చేశారు. ఇనుపరాడ్లతో మిషన్‌ పగులగొట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో రాడ్డును అక్కడే వదిలేసి పారిపోయారు.

 

ఇక మీరు ఊరు వెళ్ళేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిది...ఇళ్లలో విలువైన వస్తువులు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచాలి. 24/7 సేఫ్టీ, సెక్యూరిటీ కోసం ఇంటి ఆవరణలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. స్మార్టు ఫోన్‌ ద్వారా మానిటరింగ్‌ చేసుకునే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. రూ.కోట్లు ఖర్చుచేసిన ఖరీదైన ఇళ్లను నిర్మించుకున్న వారు తాళం విషయంలో విఫలమవుతుంటారు. అలా కాకుండా ఇంటికి సెంట్రల్‌ లాకింగ్‌తోపాటు అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి వాచ్‌మన్‌ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. పనివారుంటే ప్రతిరోజూ ఇంటి ఆవరణను శుభ్రపరచమని చెప్పాలి. ఇంటి ఆవరణలో కొన్ని లైట్స్‌ వెలిగేలా చూసుకోవాలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు బీట్‌ కాని స్టేబుల్‌ నంబర్‌ లేదా ఎస్‌ఐ నంబర్‌ తీసుకోవాలి.

 

సమాచారం ఇచ్చిన వారి ఇంటి పరిసరాల్లో పోలీసులు రాత్రిపూట గస్తీని పెంచుతారు. ఇంటి బయట కార్లు, ద్విచక్రవాహనాలను వదిలేసి వెళ్లేవారు. విలువైన వస్తువులు అందులో ఉంచొద్దు హ్యాండిల్‌ లాక్‌తో పాటు, వీల్‌లాక్‌ కూడా చేయడం ఉత్తమం. ఇంటి పక్కన వారు ఊరికి వెళ్లకుండా ఉన్నట్లయితే ఇంటిని పరిశీలిస్తుండమని చెప్పాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫోన్‌ చేయాల్సిందిగా వారికి తెలియజేయాలి. ఏమాత్రం అనుమానం ఉన్నా డయల్‌-100కు ఫోన్‌ చేయండి. ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం.

మరింత సమాచారం తెలుసుకోండి: