కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ పై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా నిరసనలు ఆందోళనలు సైతం చేపడుతున్నారు. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ నిరసన లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. వేల సంఖ్యలో ఆందోళనకారులు రహదారులపై కి చేరుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. 

 

 

 ఇక ఇంకొంతమంది ఏకంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ విధ్వంసాలు చూస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని గుర్తించి వారి సొంత ఆస్తులను జప్తు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వ్యతిరేక  స్వరాలు వినిపిస్తున్నారు. తమ రాష్ట్ర పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు, ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా  జరుగుతున్న నిరసనలు పలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. 

 

 

 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్ఆర్సీని  కాంగ్రెస్ పార్టీ  తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుంది అన్న విషయం తెలిసిందే. నిరసన కారులకు మద్దతు తెలుపుతూ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఓవైపు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే... మధ్యప్రదేశ్ కు  చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్దీప్ సింగ్ మాత్రం పౌరసత్వ సవరణ  చట్టానికి మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఉండే మన సోదరులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం కల్పిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్ఆర్సీ ని  కలిపి  చూడొద్దని పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తే తప్పేం లేదని ఆయన వెల్లడించారు. కాగా గతంలో కూడా 370 ఆర్టికల్ రద్దు కు మద్దతు ప్రకటించారు ఎమ్మెల్యే.

మరింత సమాచారం తెలుసుకోండి: