ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి హైకమాండ్ వద్దకు వెళ్లింది. దీంతో పృథ్విని టీటీడీ  చైర్మన్‌ సుబ్బారెడ్డి  పృథ్విని రాజీనామా చెయ్యమని ఆదేశాలు జారీ చెయ్యగా పృథ్వి రాజీనామా చేశాడు. రాజీనామా విషయాన్ని మీడియా సమావేశంలో పృథ్వీ స్వయంగా వెల్లడించారు. 

 

పృథ్వి మాట్లాడుతూ.. ఏన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని, పార్టీ అధ్యక్షుడి మాటను గౌరవించి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రైతులందరినీ పెయిడ్‌ ఆర్టిస్టులని తాను అనలేదని చెప్పారు. ఫేక్‌ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దీనివల్ల తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉంటానని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మందు తాగానంటూ దుష్ప్రచారం చేశారని చెప్పారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని పృథ్వీ స్పష్టం చేశారు. నేను మద్యం తాగినట్లు నిరూపించాలి. నేను ఒక్క రూపాయి తిని ఉంటే నాశనమై పోతాను. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఖండించా. 

 

పోసాని నా గురించి ఎందుకలా మాట్లాడారో తెలియదు. నేను జగన్‌కు, సుబ్బారెడ్డికి దగ్గరవుతున్నాననే టార్గెట్ చేశారు. అయితే ఇలా చెప్తూనే పృథ్వి రాజ్ ఓ విషయాన్ని బయట పెట్టారు. అదేంటంటే.... అతను క్రికెటర్ అని.. రోజు క్రికేట్ గ్రౌండ్ కి వెళ్తారని.. అయితే ఈ నెల 10వ తేదీ అయన ఉదయం గ్రౌండ్ కి వెళ్తే ఎవరో కొంతమంది ముఖంపై పిడిగుద్దులు గుద్ది అతనిపై దాడి చేసి పారిపోయారని.. వారు ఎవరో తెలుసుకుందామని వారి వెంట పరిగెత్తరని.. కానీ వారు అక్కడి నుండి తప్పించుకొని పారిపోయారు అని అయితే వారు డబ్బు కోసం దాడి చేసి ఉంటారు అని అనుకున్నట్టు పృథ్వి ఆరోపించారు.

 

అయితే అయన చెప్పినట్టు నిజంగా అతనిపై దాడి చేశారా.. ?  ఒకవేళ నిజంగా ఆ దాడి నిజమైనది అయితే ఎవరు గుద్ది ఉంటారు ? ఎవరికి పృథ్విపై అంత పగా ఉంది.. ఒకవేళ ఆలా గుద్ది ఉంటె ఇప్పుడు మచ్చలు ఉండాలి కదా.. అది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: