ఎలాగైనా రాజధాని విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించాలని అమరావతి రైతులను వాడుకుంటూ విషయాన్ని చాలా దూరం తీసుకెళ్ళిన తెలుగుదేశం పార్టీ బండారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అమరావతిలో ప్రాణం పోయింది.. గుండె ఆగింది అంటూ రోజుకొక వార్తను బయటకు తీసుకు వస్తున్న కొంతమంది అప్పుడెప్పుడో జరిగిన విషాదాలను ఎలా వాడుకుంటున్నారో చూస్తే మీరే అవాకవుతారు.

 

ఇటీవలే రాష్ట్ర రాజధాని మార్పు ను వ్యతిరేకిస్తూ ఒక అమరావతి రైతు ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఒక ఫోటో పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేశారు వైసీపీ అభిమానులు దానిని తిప్పికొడుతూ దాని పుట్టు పూర్వోత్తరాలను వెలికితీస్తే తమిళనాడులో వ్యక్తి తన భార్య చనిపోతే బాధ తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఒక ఫోటోకి ఇది మ్యాచ్ అయింది అదే ఫోటో ని పట్టుకుని అమరావతి రైతుగా అతనిని మార్చేసినవిషయం బహిర్గతమైంది.

 

ఇక తాజాగా ఆందోళన చేస్తున్న మహిళను మగ పోలీసు దారుణంగా ఈడ్చుకుని తీసుకెళ్తున్న ఫొటో వైరల్ చేశారు. మనుషులా.. పశువులా.. ఏమిటీ దారుణం? అంటూ జగన్ సర్కారుపై ఫైర్ అయిపోతూ పలువురు ట్వీట్లు కూడా చేశారు. ఇంతకీ అందులో నిజానిజాలేమిటా అని ఆరా తీస్తే.. ఫొటో రెండేళ్ల క్రితం నాటిది. అది కూడా పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు చూపిన ప్రతాపం. అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబే.

 

కనీసం విషయాన్ని కొంచెం కూడా ఆలోచించకుండా కొంత మంది మేధావులు సైతం దీనిని ట్వీట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: