మొన్న అమరావతి రైతులపై ఎస్వీబీసీ చైర్మన్, హాస్య నటుడు పృథ్వీ తప్పుగా మాట్లాడాడని పోసాని కృష్ణ మురళి ఎడాపెడా లైవ్ ప్రెస్ మీట్ లోనే వాయించేసారన్న విషయం తెలిసిందే. అలాగే నిన్న.. పృథ్వి రాజ్ ఒక మహిళతో ఫోన్లో మాట్లాడుతున్న ఆడియో టేప్ వైరల్ అయ్యింది. అయితే, ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన పృథ్వి రాజ్ఆడియో టేప్ లో ఉన్నటువంటి వాయిస్ తనది కాదని చెప్పుకొచ్చారు . రైతుల గురించి కూడా తాను తప్పుగా మాట్లాడలేదని.. కేవలం పెయిడ్ ఆర్టిస్టుల రైతుల్ని ఉద్దేశిస్తూ అలా అన్నానని.. నిజమైన రైతులకు తాను క్షమాపణ చెబుతున్నానని ఆయనన్నారు. ఆడియో టేప్ మొత్తం ఫేక్ అని, తనపై ఏదో కుట్రజరుగుతుందని.. అసలైన నిజం బయటపడేవరకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా పృథ్వి రాజ్ చెబుతూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసారు.


అయితే, రైతులపై వ్యాఖ్యలను చేసిన పృథ్వి పై జగన్ ఫుల్ గా కోప్పడ్డారట. ఆఫ్ట్రాల్ ఓ ఎస్వీబీసీ చైర్మన్ అంతటి మాటలంటారా.. అతనెంత, అతని పోసిషన్ ఎంత తీసిపడేద్దాం అని జగన్ రుసరుసమన్నారట. పార్టీలోని ఇతర నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్లకు ఏం కాలేదు కానీ పృథ్వి రాజ్ అనగానే అతని పదవి రెండురోజుల్లో ఊడిపోవడమేంటి అనే ప్రశ్న ఇప్పుడు తెలెత్తుతుంది. వాస్తవానికి ఆ పార్టీ కి సంబందించిన వారంతా పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమమని అంటున్నారు కదా మరీ పృథ్వి రాజ్ తాజాగా చేసిన పెద్ద తప్పమేంటని రాజకీయ వేత్తలు చర్చించుకుంటున్నారు. మిగతా వాళ్లకు పృథ్వికి వ్యత్యాసం ఏంటంటే.. అతను అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేయడమే. దాంతో జగన్ కు చిరెత్తుకొచ్చింది. ఆ తరువాత ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ టేప్ లో ఆ మహిళపై పృథ్విరాజ్ వేధిస్తున్నట్లు, బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఏం లేదంటూ.. భార్య లేక నిద్రరాక ఏదో తనకు నచ్చినామెతో సరసం ఆడుతున్నాడే తప్ప పెద్ద తప్పేమి చేయలేదుకదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.


అసలు పృథ్విరాజ్ ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించిన జగన్ పశ్చాత్తాపడాలని.. పృథ్విరాజ్ లో ఏ అర్హతను చూసి స్వామి వారి వాణిని నిబద్దతతో ప్రసారం చేసే పదవిని తనకు కట్టబెట్టారని అంటున్నారు రాజకీయ వేత్తలు. ఏదో పాదయాత్రలో జగన్ తో నాలుగడుగులు వేసినంత మాత్రాన పదవి ఇవ్వాలన్న ఆలోచనతో ఎస్వీబీసీ చైర్మన్ ఖాళీగా ఉంటె అది ఇచ్చేసి.. మళ్ళీ ఇప్పుడేమో బాషా బాగోలేదని తీసేస్తారా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కొడాలి నాని సంస్కారవంతమైన మాటలతో పోలిస్తే పృథ్వి మాటలు బాగానే ఉన్నాయ్ కదా.. కానీ జగన్ అతడి జోలికి పోగలడా అని ప్రశ్నిస్తున్నారు.


ఇకపోతే, పృథ్వి పై జగన్ ఆగ్రహించాడానికి అసలైన కారకులు జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. నిజమేమిటో దేవుడెరుగు కానీ అసలు రాజకీయ వర్గాలు ఏం మాట్లాడుతున్నారంటే.. ఎస్వీబీసీ చైర్మన్ కాగానే పృథ్వి కొంచెం అతిగా తన కార్యకలాపాలను మొదలుపెట్టాడని.. టీటీడీ చైర్మన్ వైవీ ఎంతా అనే స్థాయికి వెళ్లాడని.. వైవీ కి బాగా తెలిసినవారైనా వారి ముందే అతనిపై వ్యతిరేక వ్యాఖ్యలను చేశాడని.. అలాగే 36 మంది ఉద్యోగులను విధులనుంచి తొలగించి వారి ప్లేస్ లో డబ్బులిచ్చినటువంటి కొత్తవారిని పెట్టుకున్నాడని.. అలాగే కొండమీద ఉన్న గెస్ట్ హౌజ్ లో రాసలీలల కార్యక్రమం పెడుతున్నాడని దాంతో చాలామంది వైవీ రెడ్డికి ఫిర్యాదు చేసారని అని అంటున్నారు. అయితే, ఆ తరువాత పృథ్వి రాజ్ యొక్క వీడియో, ఆడియో రికార్డులను ఒక వర్గం సేకరించడం మొదలుపెట్టి..ఒకటి నెట్టింట విడుదల చేయగా.. అది తెలిసి పృథ్వి మాట జారటం.. మళ్ళీ ఆ మాటలు వైవీ రెడ్డి కి చేరడంతో బాబాయ్ అబ్బాయికు చెప్పాడని.. దాంతో అబ్బాయి ఆగ్రహించాడని.. చివరికి పృథ్వి రాజ్ పదవి పోయిందని చాలామంది చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: