ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 151 ఎమ్మెల్యే స్థానాలలో విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో జనసేన పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ జనసేన పార్టీలు రెండూ కలిసి పోటీ చేసి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పుడు పొత్తు పెట్టుకోని టీడీపీ, జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
జనసేన పార్టీ విసృత స్థాయి సమావేశంలో ఇందుకు సంబంధించిన చర్చ జరిగిందని తెలుస్తోంది. 13 జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తలతో, నేతలతో పవన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు వైసీపీతో జనసేనకు పొసగదని బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పినట్టు సమాచారం. 
 
కొందరు నేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిదని పవన్ కు సూచించారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేయటం వలనే వైసీపీ ఘనవిజయం సాధించిందని కొందరు నేతలు పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని పవన్ పార్టీ నేతలకు చెప్పారని సమాచారం. దీనితో రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తుతోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే సీఎం జగన్ కు షాక్ అనే చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైంది. కానీ 2019 ఎన్నికల్లో జనసేన లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసి కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది. జనసేన పార్టీ నేతలు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు గురించి మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుందని సమాచారం. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరితే వైసీపీ పార్టీకి, సీఎం జగన్ కు భారీ స్థాయిలో కాకపోయినా కొంత  నష్టం మాత్రం తప్పదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: