సమాజంలో దోపిడి దొంగలు ఎక్కువ అయ్యారు. వీరు నగలు నట్రా రాబడి చేయరు. లైంగికంగా వేధిస్తారు. ఎవరైన డబ్బు బాగా ఉన్న వాళ్లు ఎవడు ఎప్పుడొచ్చి దోచుకెళ్లుతాడో అని భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు డబ్బుకంటే విలువైంది ఆడపిల్లల మానా, ప్రాణాలు. డబ్బు మాట పక్కన పెడితే ఆడపిల్లలున్న ఇంటిలో భయంతో బ్రతక వలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయి.

 

 

ఎందుకంటే ఈ మద్యకాలంలో లైంగిక నేరగాళ్లు ఎక్కువగా అభం శుభం తెలియని లేలేత పసి మొగ్గలపై విషాన్ని జిమ్ముతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ 2018 సంవత్సరానికి గానూ ఇటీవల విడుదల చేసిన గణాంకాలలో తేలిన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయట. రోజుకు ఎంత లేదన్నా దాదాపు 109 మంది పిల్లలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు...  

 

 

ఇకపోతే చిన్నారులపై లైంగిక దాడులు 2017తో పోలిస్తే,  2018లో దాదాపు 22 శాతం  ఎక్కువయ్యాయని నివేదిక వెల్లడించింది. 2017లో పిల్లలపై లైంగిక దాడి ఘటనలకు సంబంధించి ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్స్‌ యాక్ట్‌(పోక్సో) కింద 32,608 కేసులు నమోదు కాగా, 2018లో 39,827 కేసులు నమోదయ్యాయి. ఒకరకంగా పిల్లలపై నేరాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.. ఇకపోతే దేశవ్యాప్తంగా 2018లో చిన్నారులపై జరిగిన నేరాల్లో ఎక్కువగా కిడ్నాప్‌, మిస్సింగ్‌లదే  ప్రదాన పాత్రగా పేర్కొన్నారు..

 

 

ఆ ఏడాది జరిగిన మొత్తం నేరాల్లో దాదాపు 44.2 శాతం కేసులు అపహరణకు సంబంధినవే. ఆ ఏడాది 67,134 మంది పిల్లలు తప్పిపోగా.. అంతకుముందు తప్పిపోయిన 71,176 మంది ఆచూకీ లభించింది.. ఇదే కాకుండా 2018లో చైల్డ్‌పోర్నోగ్రఫీ కేసులు 781 నమోదు కాగా, 2017లో ఈ కేసుల సంఖ్య 331 గా ఉంది.. ఇక ఉత్తరప్రదేశ్‌, పిల్లలపై జరుగుతున్న నేరాల్లో అగ్రస్థానంలో నిలిచింది.. ఆ రాష్ట్రంలో 19,936 కేసులు నమోదవగా, ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌ (18,992), మహారాష్ట్ర(18,892) ఉన్నాయి. ఇక 2018 లో బాల్యవివాహాలకు సంబంధించి 501 కేసులు నమోదవగా, 2017లో నమోదైన 395 కేసులతో పోలిస్తే ఇది 26 శాతం పెరగడం దురదృష్టకరం.

 

 

ఇక ఆశ్రమ గృహాల్లో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నేరాలు 2017తో పోలిస్తే 2018లో 30 శాతం పెరిగాయి. 2017లో ఈ నేరాలు 544 కాగా, 2018లో 707గా నమోదయ్యాయి. నిజంగా మనం అభివృద్ధి చెందుతున్నాం ఎందులో అంటే ఆర్ధికంగా మాత్రం కాదు. నేరాలు చేయడంలో, కిడ్నాప్‌లు చేయడంలో, హత్యాచారాలు చేయడంలో. ఒకరకంగా ఇది మానవుడి వినాశనానికి మొదలైన దారుల్లా పేర్కొనవచ్చూ.

మరింత సమాచారం తెలుసుకోండి: