ఈమధ్య హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. యువత ఎక్కువగా పబ్ కల్చర్ కి అలవాటు పడుతున్నారు. ఇక పబ్బుల్లో తాగి తూగి  ఎంజాయ్ చేస్తున్నారు యువత. అంతేకాదు ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. రోజురోజుకు పబ్బుల్లో అశ్లీలత పెరిగిపోతూ వస్తుంది . అశ్లీల నృత్యాలు చేయడం... లాంటివి పబ్బుల్లో ఎక్కువవుతున్నాయి. ఇక పోలీసులు ఎన్ని సార్లు దాడి చేసి పబ్బుల యజమానులను హెచ్చరించినప్పటికీ కూడా.. ఇలాంటి పబ్ కల్చర్ మాత్రం ఆగడం లేదు. ఇలాంటి పబ్ కల్చర్ హైదరాబాద్లో రోజు రోజుకు మరింత ఎక్కువైపోతుంది అని జనాలు అంటున్న మాట. పబ్బుల నిబంధనలు సడలించి కఠిన నిబంధనలను అమలు చేయాలని అంటున్నారు ప్రజలు. 

 

 ఇక అసలు విషయానికొస్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న ఓ పాపులర్ పబ్ లో  అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇక పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పబ్  పై దాడులు నిర్వహించారు. ఇక అక్కడికి వెళ్లి చూసేసరికి... సమాచారం ప్రకారమే అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయి... దీంతో 23 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదివారం సాయంత్రం పలువురు యువతీ యువకులు పబ్లో ఏర్పాటు చేసుకున్న పార్టీ లో భాగంగా.. కొందరు యువతులను  రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

 

 

 ఇక బంజారాహిల్స్ ఏసీపీ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 23 మంది యువతులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అయితే తాము కేవలం పార్టీ చేసుకోవడానికి మాత్రమే వచ్చామని తమను  ఎందుకు వీడియోలు తీస్తున్నారు అంటూ యువతులు మీడియా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫోన్లు లాక్కుని కింద పడేశారు. కాగా  ఓ సీడ్స్  కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: