ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల ప్రకటన ఆంధ్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతుండటం..  అమరావతి రైతుల నిరసన తెలుపుతుండటం తో  రాజధాని అమరావతిలో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. మరోవైపు టిడిపి అధినేత జగన్మోహన్ 3 రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే విశాఖలోని టిడిపి నేతలు మాత్రం జగన్ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇలా జగన్మోహన్ రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా రాజకీయాలని వేడెక్కిపోయాయి . ఓవైపు ప్రతిపక్ష పార్టీల గగ్గోలు పెడుతుంటే మరోవైపు అమరావతి రైతులందరూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం రణరంగంగా మారిపోయాయి. 

 

 

 ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయంలో జరుగుతున్న గందరగోళం పై ఆందోళన వ్యక్తం చేస్తూ బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎస్ కాశీవిశ్వనాథ రాజు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎంతో ప్రశాంతంగా ఉందని... ఒకవేళ విశాఖపట్టణంలో రాజధాని ఏర్పడితే భూకబ్జాలు సెటిల్మెంట్ గ్యాంగులు భూతగాదాలు ఎక్కువ అయిపోతాయని.. దీంతో ప్రశాంతత కరువవుతుంది అంటూ పేర్కొన్నారు. జగన్  విశాఖను రాజధాని ఏర్పాటు చేయాలని అనుకుంటే తొలుత భీమిలి స్థానం నుంచి పోటీ చేసి గెలవాలని... అప్పుడు భీమిలి వాసులు అంతరంగం ఏమిటో తెలిసి వస్తుంది అంటూ తెలిపారు. విశాఖ వాసులు అనుమానాలను నివృత్తి చేశాకే విశాఖపట్నంలో రాజధానిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవాలి అంటూ ఆయనకు ముఖ్యమంత్రిని కోరారు. తన సవాలును స్వీకరించి భీమిలి  నుంచి గెలిస్తే విశాఖ వాసులు అందరూ మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అర్థం అని ఆయన పేర్కొన్నారు. 

 

 

 

 అయితే తన ఆస్తులన్నీ విశాఖ నగరంలోనే ఉన్నాయి అని తెలిపిన కాశీ విశ్వనాథ రాజు.. విశాఖకు రాజధాని వస్తే తన భూముల విలువ ఎంతో పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే తన ఆస్తుల విలువ పెరగడం కంటే ప్రజాభీష్టం ముఖ్యమని.. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు రావాలనే ఈ లేఖ రాస్తున్నాను అంటూ పేర్కొన్నారు ఆయన. గతంలో  రాజకీయాలకు సెటిల్మెంట్లకు భయపడే వైఎస్.విజయలక్ష్మిని  విశాఖ వాసులు లక్ష ఓట్ల తేడాతో ఓడించారు అని కాశీ విశ్వనాథ రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖ నగరాన్ని సిని,  పర్యాటక ఆర్థిక ఫార్మా రంగంలో ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని.. అలా అభివృద్ధి చేయడం మానేసి విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తామని విశాఖ వాసుల్లో  కొత్త భయాలు సృష్టించ వద్దు అంటూ లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: