ఈ రోజుల్లో మాంసం  ప్రియులు  రోజురోజుకూ పెరిగిపోతున్నారు . ముక్క లేనిదే ముద్ద దిగదు చాలామందికి. వేడి వేడిగా చికెన్ మటన్ వండుకునే తిన్నారు అంటే ఆ కిక్కే వేరు అనుకుంటారు. చికెన్ మటన్ తినడానికి ఎక్కువ మొగ్గు చెబుతున్నారు మాంసం ప్రియులు. అతిగా మాంసం తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నప్పటికీ కూడా... ఆ పర్వాలేదులే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చూసుకుందాంలే..ఇప్పుడయితే  చికెన్ లాగించేద్దాం అనుకుంటూ తెగ తినేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో మాంసం అమ్మకాలు కూడా రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. మాంసానికి భారీగా డిమాండ్ పెరగడంతో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినప్పటికీ మాంసం ప్రియులు మాంసం తినడానికి ఎక్కడైనా తగ్గిస్తారు అంటారా అబ్బే అలాంటిదేమీ లేదండి అని సమాధానం చెపుతారు. అయితే మాంసం తినేటప్పుడు కూడా ఆచితూచి తినాలి అన్న విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే ఇక్కడ ఒక బాలుడు ఎంతో ఆత్రుతగా ఇంట్లో వండిన చికెన్ గబగబా తినడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ బాలుడు ఆహారనాళంలో చికెన్ ఎముక ఇరుక్కుపోయింది. ఇక వైద్యులు బాలుడి గొంతులో ఇరుక్కుపోయిన ఎముకను చాకచక్యంగా తొలగించారు. దీంతో ఆ బాలుడు చికెన్ తినడం  ఏమో కానీ... ఇది నా ప్రాణాల మీదికి వచ్చింది అనుకున్నాడు . వైద్యులు బాలుడి ఆహారనాళంలో ఇరుక్కున్న ఎముకను తొలగించడంతో తల్లిదండ్రులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... లింగంపల్లి కి చెందిన 10 ఏళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం చికెన్  తింటుండగా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఆహారనాళంలో ఇది అడ్డంగా ఇరుక్కుపోవటంతో  బాలుడు విలవిలలాడి పోయాడు. అయితే రెండు రోజుల తర్వాత ఆ బాలుని కాంటినెంటల్ హాస్పటల్ కి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. 

 

 

 అయితే ఆ బాలుడికి పరీక్షలు చేసిన అనంతరం.. వైద్యులు చాకచక్యంగా వ్యవహరించి గొంతులో ఇరుక్కున్న  ఎముకను తొలగించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆ బాలుడు ఆహారం నాలం  మామూలుగానే పని చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇలాంటి కేసులు ఆహారనాళంలో ఇరుక్కున్న ఎముకలు త్వరగా తీయకుంటే... ఆహార నాళానికి రంధ్రం ఏర్పడే అవకాశం ఉందని... ఇలా జరిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు మరణం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి అంటూ వైద్యులు హెచ్చరించారు. అందుకే మాంసం తినేటప్పుడు కొంచెం ఆచితూచి తింటే మేలు అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: