ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు పలుమార్లు బేటీ అయ్యి... ఇరు  రాష్ట్రాల అభివృద్ధికి కావలసిన పలు అంశాలను చర్చించారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఎప్పుడూ భేటీ అయిన అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటు తెలంగాణ రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఏపీ సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం పై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. ఇకపోతే నేడు మధ్యాహ్నం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ మోహన్ రెడ్డి మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు జరుగనుంది. ప్రస్తుతం ఈ ఇద్దరి సీఎంల భేటీ పై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

 

 అయితే ఈ భేటీలో కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే ఏకాంతంగా సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ రాజకీయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో మంత్రులు అధికారులు కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల వెంట ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరు 23న ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు  తెలుస్తోంది. గతంలో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేయాలనే నిర్ణయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేయడానికి కేంద్ర సహకారం లేకపోవడం వంటి విషయాలతో పాటు... ప్రస్తుత రాజకీయ పరిణామాల పై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు నీళ్లు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై కూడా మరోమారు చర్చించే అవకాశం ఉంది.

 

 

 అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి జగన్ సర్కార్ మద్దతు ఇవ్వగా టిఆర్ఎస్ సర్కార్ మాత్రం వ్యతిరేకించింది. దీంతో ఈ భేటీలో దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా విభజన చట్టంలోని పలు అంశాలను కూడా చర్చించ బోతున్నట్లు సమాచారం. ఈ భేటీలో విభజన అంశంలో ఎన్నో అంశాలు నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా 9, 10 షెడ్యూల్ లోని  సంస్థల విభజన, ఆస్తులు అప్పులు ఉద్యోగుల బదలాయింపు తదితర వాటిపై కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: