ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. రాజధాని విషయం కేంద్రీకృతమై దాని చుట్టూ అనేక వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఎటు చూసినా నష్టపోతున్నది మాత్రం జగన్ ప్రభుత్వమే. ఒక ఎమ్మెల్యే ఏమో నడిరోడ్డులో ప్రతిపక్ష నేతలని బండ బూతులు తిడతాడు. ఇంకొరేమో రైతు అంటే ఇలాగే బ్రతకాలి అంటూ వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయడమే కాకుండా స్వామి వారి దేవస్థానం లో ఉన్నత పదవిలో ఉండి తన కింద పనిచేసే ఉద్యోగిని తో ఫోన్ లో సరసాలు ఆడుతాడు. వీటన్నింటికీ మించి మరికొందరు రోడ్ల మీద పడింది రౌడీయిజం చేస్తుంటారు.

 

ఇవన్నీ చాలదు అన్నట్లు ఒకపక్క జోలె పట్టుకొని చంద్రబాబు మరొక పక్క పట్టువదలని విక్రమార్కుడు గా పవన్ కళ్యాణ్ జగన్ ను అణిచివేసేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే నిన్న కాకినాడలో వైసీపీ అభిమానులు గా చెప్పబడే కొంతమంది రోడ్లమీద మహిళలని కూడా చూడకుండా జనాలపై దాడికి పాల్పడిన విషయం మరియు జనసేన మద్దతుదారులను నాయకులను ఇష్టం వచ్చినట్లు కొట్టిన వివాదం చాలా సంచలనం అయింది.

 

విషయంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తమ వారిపై అబద్ధపు కేసులు పెడితే మాత్రం తాను సరా సారి ఢిల్లీ నుండి కాకినాడ కు వస్తానని... అక్కడే విషయాన్ని తేల్చుకుందాం అని అన్నాడు. అయితే అమిత్ షా మరియు జేపీ నడ్డా లను కలిసేందుకు వెళ్లిన పవన్ కు అక్కడ ఇంకా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కాలేదు. అసలు సమయానికి కావచ్చు అని ఒక అంచనా కూడా లేదట. అందుకే పవన్ కళ్యాణ్ సమయానికి కాకినాడ కు రాలేకపోయారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మోడీ సర్కారు పవన్ కు ఎప్పటికి అపాయింట్మెంట్ ఇచ్చి కాకినాడకు పంపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: