జనసేన అధినేత పవన్ కల్యాన్ కు నిజంగానే ఢిల్లీలో ఘోర అవమానమే జరిగింది. ఫోన్ చేసి శనివారం సాయంత్రం పవన్ ను అర్జంటుగా రమ్మని పిలిపించిన బిజెపి అగ్ర నేతలు సోమవారం ఉదయం వరకూ కూడా అపాయిట్మెంట్ ఇవ్వకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. బిజెపి నేతలు సరే చివరకు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పవన్ తో మాట్లాడటానికి టైం కేటాయించకపోవటమే విచిత్రంగా ఉంది.

 

శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తల సమావేశంలో ఉన్నపుడు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది ఢిల్లీలోని బిజెపి అగ్ర నేతల నుండి కావటంతో వెంటనే పవన్ పక్కకు వెళ్ళి మాట్లాడారు. సరే ఫోన్లో ఏమి మాట్లాడుకున్నారో బయటకు తెలీలేదు లేండి. ఫోన్లో మాట్లాడగానే సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. తనతో పాటు ఉన్న మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వెంట పెట్టుకుని అప్పటికప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు.

 

అంత అర్జంటుగా పవన్ ఢిల్లీకి చేరుకున్న పవన్ వెంటనే ఎవరెవరిని కలిశారు ?  ఇంత వరకూ ఎవరినీ కలవకుండా కేవతం హోటల్ గదికే పరిమితమైపోయారని సమాచారం. అంటే శనివారం సాయంత్రం, రాత్రి, ఆదివారం మొత్తం ఎవరితోనే భేటి కాలేదు. ఎందుకంటే అంత అర్జంటుగా పవన్ పిలిపించిన బిజెపి అగ్రేనేతలు మళ్ళీ అడ్రస్ లేరట.

 

పార్టీ జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా మధ్య ప్రదేశ్ పర్యటనతో పాటు ఢిల్లీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నారు. కాబట్టి పవన్ ను కలవటానికి టైం కేటాయించలేదు. పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా అయినా పవన్ తో భేటి అయ్యారా అంటే అదీ జరగలేదు. ఆయన కూడా ఢిల్లీ ఎన్నికల బిజిలోనే ఉండిపోయారు. 

 

మరో కీలక నేత పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అయితే అసలు ఢిల్లీలోనే లేరు. సోమవారం మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకుంటారట.  సరే వీళ్ళందరూ ఏదో బిజిగానే ఉన్నారని ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలను కలుద్దామని పవన్ ప్రయత్నించారట. అయితే వాళ్ళు కూడా విపరీతమైన బిజీగా ఉండటంతో వాళ్ళూ కలవలేదట. మరి ఇంత  బిజీగా ఉన్నపుడు పవన్ ను పనిగట్టుకుని ఎందుకు పిలిపించారో ఎవరికీ అర్ధం కావటం లేదు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: