ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రకటించిన మూడు రాజదానుల  నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర  వ్యాప్తంగా సీఎం జగన్ ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయం  చర్చనీయాంశంగా మారింది. కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం నిర్ణయానికి మద్దతు పలుకుతుంటే..  ఇంకొంతమంది జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వరాలు వినిపించారు. ఇక ఆంధ్ర  రాజకీయాల్లో అయితే ప్రతిపక్ష టిడిపి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతు ... రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తుంది ప్రతిపక్ష టీడీపీ. అంతేకాకుండా రాజధాని అమరావతి లో నిరసన తెలుపుతున్న రైతులందరికీ మద్దతు తెలుపుతూ... విరాళాలు సైతం స్వీకరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 

 

 

 జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా  వెంకన్న తీవ్రస్థాయిలో ఇప్పటికే ఎన్నోసార్లు విమర్శలు గుప్పించారు అన్న విషయం తెలిసిందే. ఇక మరో సారి జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. స్వార్థానికి మారుపేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అని బుద్ధ వెంకన్న విమర్శించారు. కేవలం జగన్ తన సొంత ప్రయోజనాల కోసమే రాజధాని అమరావతి విషయంలో... ఇలా వ్యవహరిస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిపోవాలని తండ్రి శవం పక్కన ఉండగానే జగన్ సంతకాలు సేకరించారు అని విమర్శించారు. పదవి దక్కకపోయినా సరికి ఓదార్పు యాత్ర అంటూ శవాల దగ్గర ముసలి కన్నీరు కార్చారు అంటూ బుద్ధ వెంకన్న విమర్శించారు. 

 

 

 తండ్రి లేని కొడుకుని అరెస్టు చేస్తారా అంటూ మహిళలు అడ్డుపెట్టుకొని జగన్ ఆనాడు సెంటిమెంట్ రగిల్చాడు  అని బుద్ధ వెంకన్న ఘాటు విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతిని చంపడానికి అనేక కుట్రలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేశారు. పచ్చని పంట పొలాలు తగులబెట్టాడు... ఇప్పుడేమో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి ... చలి కాగుతున్నారు సీఎం  జగన్ గారు... స్వార్ధానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉంటుందా విజయసాయి రెడ్డి గారు... అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు బుద్ధ వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: