ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి పాలనపైనే దృష్టి సారించారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ఎన్నో హామీలను, పథకాలను కూడా ఇప్పటికే అమలు చేస్తున్నారు కూడా. అయితే.. వీటిన్నింటినీ ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి జగన్ ను ప్రజలకు మరింత దగ్గర చేయాల్సిన వైసీపీ నేతల్లో కొందరు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల్లో మరింత బలపడాల్సిన సమయంలో వీరి వల్ల పార్టీకి నష్టం చేకూరుతోందనే విమర్శలు వస్తున్నాయి.

 

 

నిజానికి జగన్ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కానీ.. కొందరి ప్రవర్తనపై ప్రజలకు సంజాయిషీ చెప్పే పరిస్థితులు వస్తున్నయని కొందరు నాయకులు అంటున్నారు. కొందరు నేతలు ప్రతిపక్ష నేతలను బహిరంగంగా ప్రస్తావిస్తున్న తీరు పలు వివాదాలకు దారి తీస్తోంది. వీరు చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేవే తప్ప వైసీపీకి కానీ సదరు నాయకులకు కానీ ఎటువంటి లాభం ఉండదు. రాజకీయంగా దూషించడం వేరు, వ్యక్తిగతంగా దూషించడం వేరు, బహిరంగంగా వ్యక్తులను బూతులు తిట్టడం వేరు. ఇది ప్రజలెవరూ హర్షించరు. తాము ఎన్నుకున్న నాయకుడు బహిరంగంగా ఇతర పార్టీ వారిని దూనమాడటం ఎవరూ హర్షించేది కాదు.

 

 

ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటివల కొందరిపై వచ్చిన ఆరోపణలు కూడా వైసీపీకి ఏమాత్రం మంచిది కాదు. ఈ అంశం కూడా పార్టీని నష్టం చేకూర్చేదే. ఇప్పటికే దీనిపై పార్టీలో తీవ్రమైన చర్చలు జరిగాయి. దీనిపై విచారణ చేయించాలని పార్టీ పెద్దలు కోరుతున్నారు. ప్రజల భక్తికి, నమ్మకానికి, పవితృతకు సంబంధించిన విషయంలో పార్టీ బలవడం మంచిది కాదనేది కొందరి అభిప్రాయం. పార్టీ వెంటనే మేల్కొన్నా అది నష్ట నివారణ కిందకే వస్తుంది. మరి జగన్ ఇటువంటి పరిణామాలపై ఎలా స్పందిస్తారో.. నాయకులకు, కార్యకర్తలకు ఎలా దిశానిర్దేశం చేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: