జైళ్ళంటేనే మనుషులకి చాలా భయమేస్తుంది. అందర్నీ విడిచి, అన్నింటినీ మరిచి ఒక్కరే ఉండడం సులభమైన విషయం కాదు. అందుకే ఏదైనా తప్పు చేస్తే జైళ్ళొ వేస్తే వారికి బయట ప్రపంచం వాల్యూ తెలుస్తుందన్న ఉద్దేశ్యంతోనే జైళ్ళు సృష్టించబడ్డాయి. అయితే జైళ్ళో ఒంటరితనంతో పాటు భయంగొల్పే ఆత్మలు కూడా ఉంటే ఆ ఖైదీ పరిస్థితి ఎలా ఉంటుంది...? ఒంటరితనంతో బాధపడే ఖైదీకి తనతో పాటు కనిపించనిదేదో ఉందని తెలిస్తే ఎంతలా భయపడతాడు...?

 

అవును మీరు వింటున్నది నిజమే కేంద్ర కారాగారమయిన తీహార్ జైళ్ళో దెయ్యం ఉందని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జైలు గది నంబరు మూడు నాలుగులో ఈ దెయ్యాల బెడద ఎక్కువగా ఉందని అంటున్నారు. దీని మీద ఖైదీలందరూ ముక్త కంఠంతో సమాధానం చెప్తున్నారు. తీహార్ జైల్లో బెయిల్ మీద బయటకు వచ్చిన ఓ నేరగాడు ఈ విధంగా చెప్పాడు.. ‘‘నేను సుమారు 15 నెలలు జైలు నెం.3లో ఉన్నాను. 

 

నేను ఆ జైలు గదిలోకి వెళ్తున్నాని తెలియగానే కొందరు నాకు ఆత్మల గురించి చెప్పారు. నన్ను భయపెట్టించి ఆటపట్టించడానికే అలా చెబుతున్నారేమో అనుకున్నాను. కానీ, నాకు అక్కడ వింతైన అరుపులు వినిపించాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయం ఎవరితో చెప్పలేదు’’. అలానే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎవరో నన్ను చెంప దెబ్బ కొట్టినట్లనిపించింది. వెంటనే ఈ విషయాన్ని పై అధికారులకి చెప్పాను. కాని వారు నేను చెప్పింది నమ్మలేదు..

 

డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మరో ఖైదీ చెప్పిన దాని ప్రకారం  జైలు నంబరు గది నాలుగులో తనని ఎవరో చెంపదెబ్బలు కొట్టినట్లు అనిపించిందట. అలాగే పడుకున్నప్పుడు దుప్పట్లు లాగడం... సామాన్లన్నింటినీ చిందరవందరగా చేయడం జరిగేదట... ‘‘ఓసారి ఖైదీ మరో ఖైదీని చంపేశాడు. జైలు నెంబరు 3లో ఉంటున్న ఆ ఖైదీని అధికారులు విచారించగా.. ఆ ఖైదీని చంపాలని ఓ ఆత్మ తనకు చెప్పిందన్నాడు’’ అని తెలిపారు. మరి జైలులో ఈ దయ్యాల గోల ఏంటని కనుక్కుందామని సీసీ కెమారలని పరిశీలించగా వాటిలో ఏమీ కనబడలేదని తెలిసింది. ఇదంతా మానసికంగా సరిగ్గా లేని ఖైదీల వల్లేనని తేలింది. అయినా ఇప్పటికీ అక్కడ ఖైదీలు ఏదో ఉందనే అనుమానంతోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: