తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.  ప్రగతి భవన్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్ ఉండగా..ఏపీ సీఎం జగన్ తో ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు సీఎంలు క‌లిసి మద్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు.

 


మధ్యాహ్న భోజనం అనంతరం నదీజలాలు, విద్యుత్‌ ఉద్యోగులు తదితర విభజనకు సంబంధించిన అంశాలపై తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీలో చర్చిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ ‌‌రెగ్యులేటర్ ‌‌ కెపాసిటీ 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోగా, తెలంగాణలో రాజకీయ విమర్శలు వచ్చాయి. దీనిపైనా ఇద్దరు సీఎంలు చర్చించనున్నట్టు తెలిసింది. విద్యుత్ ‌‌ ఉద్యోగుల విభజన కొలిక్కిరాగా, షెడ్యూల్ ‌‌ 9, 10 లోని సంస్థల విభజన ఇంకా పెండింగ్ ‌‌లోనే ఉంది. ఆప్మెల్ ‌‌ను ఏపీ ప్రభుత్వరంగ సంస్థగా ప్రకటించడంపై తెలంగాణ అభ్యంతరం చెప్పింది. ఫైనాన్స్ ‌‌ కమిషన్ ‌‌ బైఫరికేషన్ ‌‌, కేంద్రంతో సంబంధాలు సహా పలు అంశాలపై మాట్లాడుకోనున్నారు.

 

మాజీ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చొరవతో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి అనువైన వాతావరణం ఏర్పడింది. 2019లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. వారితో గవర్నర్‌ ప్రాథమికంగా భేటీ అయిన సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చారు. ఖాళీగా ఉన్న సచివాలయ భవనాలను సీఎం కేసీఆర్‌ కోరిక మేరకు తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్‌ సుముఖత వ్యక్తంచేశారు. ఆ వెంటనే సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించారు. అనంతరం విభజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2019 జూన్‌ 11వ తేదీన నాటి గవర్నర్‌కు ఏపీ సీఎం జగన్‌ లేఖరాశారు. స్పందించిన గవర్నర్‌.. విభజన సమస్యలను మంచి వాతావరణంలో పరిష్కరించుకోవాలని కోరుతూ 2019 జూన్‌ 12న ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: