గతంలో జరిగిన రెండు ఘటనల వలన ఎస్వీబీసీ చైర్మన్ పదవికి సీనియర్ హాస్య నటుడు పృథ్వి రాజ్ నిన్న రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి ఎవరికి అప్పగిస్తారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొదటగా వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి పేరు వినిపిస్తుండగా.. మరొకవైపు ఒక సీనియర్ మహిళా జర్నలిస్ట్ సప్న పేరు వినిపిస్తుంది.



అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎస్వీబీసీ చైర్మన్ బాధ్యతలను మహిళకు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారట. దీంతో సీనియర్ జర్నలిస్ట్ స్వప్న చైర్మన్ పదవిని దాదాపుగా దక్కించుకున్నట్లు సమాచారం. గతంలో జర్నలిస్ట్ స్వప్న సాక్షి ఛానల్ లో ప్రముఖ జర్నలిస్టుగా ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా, వైఎస్ఆర్సిపి పార్టీ విజయంలో ఆమె జర్నలిస్టుగా కీలకమైన పాత్ర వహించారన్న విషయం విదితమే. దీని కారణంగా ఒక ప్రైవేటు ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ స్వప్న కి ఎస్వీబీసీ డైరెక్టర్ పదవిని జగన్ అప్పగించారు. సో, ప్రస్తుతం ఆమె ఎస్వీబీసీ డైరెక్టర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


సీనియర్ జర్నలిస్ట్ స్వప్న బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనగా తనకు సంగీతం, సాహిత్యంపై పట్టు ఉండటంతో పాటు పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉంది. అందుకే, ఆమె నేతృత్వంలో ఎస్వీబీసీకి తప్పనిసరిగా మంచి పేరు లభిస్తుందని అనేకమంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలన్నిటిని బలపరిచే విధంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఓ సీనియర్ జర్నలిస్టు.. అది కూడా ఒక మహిళకు అవకాశం ఇస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలనుంచి సమాచారం వస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ స్వప్న పేర్లు వినిపిస్తుండగా.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని జగన్ మోహన్ రెడ్డి ఎవరికి ఇస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: