చరిత్రలో జనవరి 14వ తేదీన ఎన్నో సంఘటనలు ఎంతో మంది జననాలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. కాగా నేడు చరిత్రలోకి తొంగిచూస్తే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 మూడో పానిపట్టు యుద్ధం : 1761 జనవరి 14వ తేదీన మరాఠాలు ఆప్గాన్ల  మధ్య మూడవ పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ  యుద్ధంలో   అహ్మద్ షా అబ్బాలి  విజయం సాధించింది. 

 

 

 మైయిడెడ్  ఓవర్ల రికార్డు : ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్ బాపు నాదకర్ణి సంచలన రికార్డు నమోదు చేశారు. ఇప్పటికీ ఆయన రికార్డును ఎవరూ చేరుకోలేకపోయారు. టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేసిన భారత బౌలర్లు బాపూ నాదకర్ణి వరుసగా 21 ఓవర్లు మెయిడెడ్  వేసి సంచలనం సృష్టించారు. అయితే వికెట్లు ఏమి తీసుకోన్నప్పటికీ టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 32 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఇప్పటికీ ఈ ఆటగాడు సృష్టించిన రికార్డు పదిలంగానే ఉంది. కాగా ఈ ఘటన  1964 జనవరి 14 వ తేదీన జరిగింది.

 

 

 మద్రాసు పేరు మార్పు : అప్పుడు మద్రాస్ గా పేరుగాంచిన రాష్ట్రాన్ని తమిళనాడు గా మార్చారు. ప్రస్తుతం తమిళనాడు పేరులోనే రాష్ట్రం కొనసాగుతోంది. 1969 జనవరి 14న మద్రాసు పేరును తమిళనాడు గా మార్చారు.

 

 

 దూరదర్శన్ ప్రారంభం : దూరదర్శన్ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యాయి. 1987 జనవరి 14 వ తేదీన రాష్ట్రంలోని 16 ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్మీటర్ లను  ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రానికి అనుసంధానం చేసి తెలుగు ప్రసారాలు ప్రారంభించారు. అంతకు ముందుగా కేవలం హిందీ  కార్యక్రమాలు ఢిల్లీ నుంచి మాత్రమే ప్రసారం అయ్యేవి. 

 

 భారతరత్న పురస్కారం : ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. గానకోకిల గా పేరు తెచ్చుకున్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడిన పాటలు ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయుడిగా నిలిచిపోయాయి.  పలు సినిమాల్లో నటిగా కూడా తన సత్తా చాటింది. భారత దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారత రత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి కళాకారిణి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి. 1998 జనవరి 14 వ తేదీన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. 

 

 

 బాలగంగాధర్ తిలక్ జననం  : ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు అయిన బాలగంగాధర్ తిలక్ 1926 జనవరి 14న జన్మించారు. అయినా స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు ఎదురుగా నిలబడి ఎంతో కాలం పోరాటం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక వ్యక్తిగా బాలగంగాధర్ తిలక్ వ్యవహరించారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో జన్మించిన బాలగంగాధర్ తిలక్ దర్శకుడు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈయన  2010 సంవత్సరంలో మరణించారు. ఇప్పటికే భారతదేశం మొత్తం బాలగంగాధర్ తిలక్ జయంతి వర్ధంతి లను జరుపుకుంటోంది. 

 

 

 శోభన్ బాబు జననం : తెలుగు చిత్ర పరిశ్రమలు సోగ్గాడుగా  పేరు తెచ్చుకున్నారు శోభన్ బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో సాటిలేని అందగాడిగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న సినిమా కథానాయకుడు. ఎక్కువగా కుటుంబ కథ పాత్రల్లో నటించడంతో పాటు ఎన్నో ప్రేమకథ సినిమాల్లో కూడా నటించి.. తెలుగు చిత్ర పరిశ్రమకి గొప్ప అందగాడిగా సోగ్గాడిగా  పేరు సంపాదించారు శోభన్ బాబు. శోభన్ బాబు 1937 జనవరి 14 వ తేదీన జన్మించారు. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. 

 

 

 జంధ్యాల జననం : ప్రముఖ దర్శకుడు మాటల రచయిత తెలుగు చిత్ర పరిశ్రమలో కళామతల్లికి ఎన్నో ఏళ్లుగా సేవలందించి ఎంతో మంది దర్శకులకు స్పూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి జంధ్యాల 1951 జనవరి 14 వ తేదీన జన్మించారు. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన జంధ్యాలను  ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఉంటారు. చిత్రపరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు  జంధ్యాల. 2001 సంవత్సరంలో జంద్యాల  పరమపదించారు. 

 

 

 జయప్రకాష్ జననం : లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్. 1956 జనవరి 14 వ తేదీన జన్మించారు. కృష్ణా జిల్లా కు చెందిన ఈయన... ఐఏఎస్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత రాజకీయాల తిరును మార్చాలని లోక్ సత్తా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారు. ఇప్పటికీ జయప్రకాష్ నారాయణ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. 

 

 కిరీటి దామరాజు : తెలుగు చిత్ర పరిశ్రమలో కిరీటి దామరాజు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు కొసమెరుపు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనదైన సత్తా చాటాడు కిరీటి దామరాజు. ముఖ్యంగా అన్ని సినిమాల్లో పెళ్లి కొడుకు పాత్రలో నటిస్తూ ఉంటాడు కిరీటి దామరాజు. ఇక బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కిరీటి దామరాజు తెలుగు ప్రేక్షకులందరికీ మరింత సుపరిచితులు గా మారిపోయాడు. ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: